వర్కింగ్ జర్నలిస్టుల హక్కు ప్రెస్ అక్రిడిటేషన్. అలాంటి అక్రిడిటేషన్ జర్నలిస్టులు లెక్కలేనన్ని అగచాట్లు పడుతున్నారు. దానికి తొలి కారణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలు పదుల సంఖ్యలో ఉంటే.. స్థానిక పత్రికలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రధాన పత్రికల నుంచి స్థానిక పత్రికల వరకూ నిర్వహణ భారం ఒక్కటే. కానీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎక్కువ ఎడిషన్లు ఉన్న పత్రికలను ఒకలా, స్థానికంగా ఉన్న చిన్న పత్రికలకు ఒకలా గుర్తిస్తున్నది. గత ప్రభత్వంలో స్థానిక పత్రికలను నిర్వీర్యం చేసేందకు తీసుకు వచ్చిన జీఓనెంబరు 38 వలన స్థానిక పత్రికలు పిట్టల్లా రాలిసోయాయి. జిఎష్టీ, ఎనిమిదిపేజీలు, ప్రింటింగ్ ప్రెస్ ల తనిఖీ పేరుతో చిన్న పత్రికల పాతాలానికి తొక్కేసింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కాస్త వెసులుబాటు ఇచ్చినా.. గత ప్రభుత్వ విధానాలే అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. గతంలో టిడిపి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్థానిక దినపత్రికలకు నాలుగు పేజీల బ్రాడ్ షీట్ ముద్రించి పంపిణీ చేస్తే.. మండలానికి ఒక ప్రెస్ అక్రిడిటేషన్ ఇచ్చేది.
అదే టిడిపి ప్రభుత్వం మళ్లీ నిబంధనలు కఠిన తరం చేసి వాటిని కుదించేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిని ఆరు అక్రిడిటేషన్లకు కుదించేసింది. అదీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తే ఒకలా.. ప్రతికూలంగా రాస్తే ఒకలా వ్యవహరించింది. కొన్ని ప్రధాన పత్రికలకు కూడా అక్రిడిటేషన్లు కోత కూడా పెట్టేసింది. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎడిషన్లు ఎక్కువగా ఉన్న పత్రికలతోపాటు, స్థానిక పత్రికలకు కూడా ఎంపానల్ ఉంటే ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టింది. దానివలన స్థానిక పత్రికలకు ప్రింటింగ్, పత్రిక పంపిణీ ఖర్చుల భారం కొద్దిమేర తగ్గినట్టు అయ్యింది. అయినా కూడా చాలా కాలంగా చేయని స్థానిక పత్రికల ఎంపానల్ మెంట్ విషయంలో కూడా గతంలో నిబంధనలు ఉన్నా టిడిపి ప్రభుత్వం స్థానిక పత్రికలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఎంపానల్ మెంట్ కి దరఖాస్తు చేసుకుంటే చిన్నా చితకా లోపాలున్నా ఎంపానల్ మెంట్ సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా చేసేది.
అది చాలాకాలంగా నిలిపివేయడంతో నిరాటకంగంగా పత్రికలు నడుతుపున్న వారికి ఎంపానల్ మెంట్ లైసెన్సు రాక నిత్యం పత్రిక ముద్రిస్తున్నా ప్రభుత్వ ప్రకటనలు రావడం లేదు. అంతేకాదు.. అక్రిడిటేషన్ల విషయంలో కూడా ఎంపానల్ మెంట్ ఒకలా, లేకపోతే మరోలా ఇవ్వడం కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బందులను తెచ్చి పెడుతున్నది. పత్రికలను ఎక్కడా ఆపకుండా నడపడానికి జర్నలిస్టులు భార్యల మెడలో పుస్తులు అమ్మి కూడా పత్రికలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అయినా జర్నలిస్టుల ఇబ్బందులు ఏమీ పట్టకుండా ప్రభుత్వం ప్రెస్ అక్రిడిటేషన్ దేశంలో లేని విధంగా నిబంధనలు పెట్టి వాటిని తొలుత కుదించేసి.. తరువాత పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఒకరకంగా పెద్ద పత్రికలతో పాటు, సమాచారశాఖ కూడా స్థానిక, చిన్న పత్రికలను అంటరానివారిగా చూడటం కూడా ఆందోళన కలిగిస్తున్నది. స్థానిక పత్రికలకైనా, పెద్ద పత్రికలకైనా ఆర్ఎన్ఐ నుంచి లెసెన్సు వచ్చి నిరాటంకంగా పత్రిక ముద్రిస్తేనే గుర్తింపు.
అలాంటి గుర్తింపు కోసం అనాదిగా స్థానిక పత్రికలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. అలాగని పెద్ద పత్రికలకు సాంకేతిక ఇబ్బందులు, ప్రభుత్వ జీఓలో పొందు పరిచిన అంశాల్లోని లోటు పాట్లు లేకుండా ఉన్నాయా అంటే అక్కడ కూడా ఉన్నాయి. ఒక్కోచోట ప్రధాన పత్రికల కంటే స్థానిక పత్రికలు చక్కగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు ప్రెస్ అక్రిడిటేషన్ కి నానా పాట్లు పడాల్సి వస్తున్నది. గతంలో టిడిపి ప్రభుత్వంలో ఎన్నడూ ప్రెస్ అక్రిడిటేషన్లు జారీ ఆలస్యం కాలేదు. కానీ ఈసారి కూటమిగా వచ్చిన సందర్భంలో సోషల్ మీడియాకి కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడంతో ఆ రిపోర్టుకోసం మరింత ఆలస్యం అవుతున్నది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలోని జీఓ నెంబరు 38 లా నిబంధనలు ఇస్తుందా.. లేదంటే గతంలో మాదిరిగా సడలింపులతో ఇస్తుందా అనే విషయం తెలియాలంటే క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఇచ్చి కొత్త ఉత్తర్వులు వచ్చే దాకా తెలీదు..!