పరిమిత భక్తులతోనే శ్రీవారి వాహనసేవలు..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Tirumala
                            2020-10-01 19:36:27
                        
                     
                    
                 
                
                    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో టిటిడిలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్  భరత్ నారాయణ గుప్తాతో కలిసి ఈ సమీక్ష చేపట్టారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
- పరిమితంగా భక్తులతో నాలుగు మాడ వీధుల్లో స్వామివారి వాహనసేవల ఊరేగింపు ఉంటుంది. గరుడ సేవతో పాటు అన్ని వాహనసేవలకు దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతిస్తారు.
- ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి.
- బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన అక్టోబరు 21న సాయంత్రం పుష్పక విమానసేవ, అక్టోబరు 23న స్వర్ణరథం ఊరేగింపు ఉంటాయి.
- అక్టోబరు 24న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
- గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు ఫుట్ ఆపరేటెడ్ శానిటైజర్లు ఏర్పాటు.
- భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు. తగినన్ని లడ్డూలు తయారీ.
- పరిమిత సంఖ్యలో పోలీసులు, శ్రీవారి సేవకుల సేవలు.
- హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పరిమిత సంఖ్యలో కళాబృందాలతో వాహనసేవల ముందు ప్రదర్శనలు.
- కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు.
         ఈ సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్  విష్ణుచరణ్, టిటిడి చీఫ్ ఇంజినీర్  రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో  శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.