టిటిడి ఎక్స్ అఫిషియోగా ఎం.గిరిజాశంకర్ 
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
Tirumala
                            2020-10-02 17:32:29
                        
                     
                    
                 
                
                    రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి  ఎం.గిరిజాశంకర్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు, వేదపండితులు వేదాశీర్వచనం అంద జేశారు. గిరిజాశంకర్ కు పరిపాలన విభాగంలో చాలా మంచి అనుభవం వుంది. అంతేకాకుండా ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకోవ డంలో అందెవేసిన చేయి. గ్రామసచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో ప్రజలకు పూర్తిస్థాయిలో మంచి సేవలు అందిస్తుందంటే ఈయన తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం ఆమోదించడమే. అలాంటి ఉత్తమ అధికారి టిటిడిలోకి రావడంతో ఇక్కడ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని శ్రీవారికి మరింతగా ప్రజలను చేరువ చేస్తారనే నమ్మకం చాలా మందిలో కలుగుతోంది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి, జెఇఓ  పి.బసంత్ కుమార్, జెఇఓ(విద్య, ఆరోగ్యం) ఎస్.భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, డెప్యూటీ ఈవో జనరల్ సుధారాణి పాల్గొన్నారు.