మేయర్ గా చేశావు రూల్స్ తెలియవా..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 6
                            
                         
                        
                            
Seethammadara
                            2020-10-04 11:17:02
                        
                     
                    
                 
                
                    అక్రమకట్టడమని తెలుసు, ఆక్రమించుకున్నదనీ ఆ విశాఖ ఆక్టోపస్ కు తెలుసు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ముఖ్యమంత్రిపై రంకెలేస్తున్నాడు. మేయ ర్ గా పనిచేసినవాడే పార్కులను ఆక్రమించాడు. ఏపీ రాజకీయాలపై  పచ్చమీడియాలో జాతకాలు చెప్తాడు. మేయర్ గా చేసినవాడికి మున్సిపల్ రూల్స్ తెలియవా? అంటూ రాజ్య సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ సబ్బంహరిపై ఫేస్ బుక్ వేదికగా మండి పడ్డారు. ప్రజా ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తే కబ్జాలకు పాల్పడుతుంటే ప్రజలకు ఏం చెబుదామని అంటూ చురకలు అంటించారు. శనివారం తెల్లవారుజామున జీవిఎంసి అధికారులు మాజీ మేయర్ టిడిపి నేత సబ్బం హరి ఆక్రమించిన 12 అడుగుల స్థలంలో నిర్మించిన మరుగుదొడ్లను జేసీబీలతో కూలగొట్టించారు. ఆ సమయంలో సబ్బం చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ జవాబు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి చట్టం తనపని తాను చేసుకుంటూ పోయిన విషయంలో జరిగిన రొంపి రాజకీయవర్గాల్లో గట్టి చర్చనే లేవదీసింది. అయితే దీనికి సహేతుకమైన కారణంగా దురాక్రమణ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుండటంతో ఎవరూ సబ్బానికి చేదోడుగా రాకపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది.