రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది..సీఎం


Ens Balu
2
District Collector And Magistrate Office
2020-07-08 22:40:03

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైయస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి రైతు గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని, రైతులు వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ఉచిత విద్యుత్తు పై తొలి సంతకం చేసిన మహానుభావుడని కొనియాడారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని, వారి సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా పనిచేస్తున్న భీమసింగి , చోడవరం సుగర్ ఫ్యాక్టరీ లతో పాటు పనిచేయని అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీకు సైతం బకాయిలను ఇచ్చారంటే రైతులంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బలంగా నమ్మే మనస్తత్వం గల వ్యక్తి అని కొనియాడారు. అర్ బీ కే ల ద్వారా విత్తనాల దగ్గర్నుండి పంట కొనే వరకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొనేవిధంగా రైతులకు భరోసా ,నమ్మకాన్ని కలిగించిన వ్యక్తిగా చరిత్ర లో నిలిచి పోతారన్నారు. జిల్లా ఎం ఎల్ ఏ లు, మరియూ రైతాంగం తరఫున తన ప్రత్యేక ధన్య వాదాలను తెలియ జేసుకొంటున్నానన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో 739 గ్రామ సచివాలయాలలో 622 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, 5 ఆర్ బి కే హబ్స్ మరియు అనకాపల్లి నందు శాస్త్ర సాంకేతిక సహాయం అందించుటకు జిల్లా వనరుల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కియోస్క్ ద్వారా రైతులు తమకు కావాల్సిన ఉత్పాదకాలను ఆర్డర్ పై తీసుకోవడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా 2019 సంవత్సరానికి గాను 3,40,134 మంది రైతులకు 277.50 కోట్లు,2020-21 సం. కు 3,48,388 మంది రైతులకు మొదటి విడతగా 194.4 2కోట్లు లబ్ది చేకూరుతుందన్నారు. వైయస్సార్ రైతు దినోత్సవ వేడుకలలో భాగంగా (1) సమగ్ర ఎరువుల యాజమాన్యం తో సూక్ష్మ పోషకాల లోపాలను నివారిద్దాం, (2) వైయస్సార్ పొలంబడి, (3) వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, (4) పంట సాగు దారు హక్కు పత్రం,(5) సరైన సమయంలో సరైన మోతాదు ఎరువులతో పంటకు బలం,(6) ప్రత్తి పంట వివిధ దశలలో గులాబిరంగు పురుగు ఉధృతి మరియు యాజమాన్యం,(7) వైయస్సార్ రైతు భరోసాలకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలక్టర్ వేణు గోపాల్ రెడ్డి,శాసన సభ్యులు కన్న బాబు రాజు ,కరణం ధర్మశ్రీ, గొల్ల బాబురావు, గుడివాడ అమర్నాథ్ ,అదీప్ రాజు , పెట్ల ఉమా శంకర్ గణేష్ ,డీ సి సి బి చైర్మన్ సుకుమార్ వర్మ, వ్యవసాయ శాఖ జేడీ లీలావతి , పశు సంవర్ధక, ఉద్యాన, పట్టు,మత్స్యశాఖ,ఇరిగేషన్ తదితర శాఖ ల అధికారులు హాజరయ్యారు.