సీఎస్ నీలం సాహ్ని  ముందుకి జీఓనెం..149
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 3
                            
                         
                        
                            
Amaravati
                            2020-10-06 13:44:18
                        
                     
                    
                 
                
                    భారదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థను జిల్లా స్థాయిలో కొందరు అధికారులు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న అంశం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ముందుకు వెళ్లింది..  గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు బదలాయించకుండా..జీఓనెంబరు 149 అమలు చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్న విషయాన్ని 10 రోజులుగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి చెందిన.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రత్యేక కధనాలు కూడా అందిస్తూ వచ్చింది.. గ్రామసచివాలయ వ్యవస్థలో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు బదలాయించే జీఓనెంబరు 149ని రాష్ట్రవ్యాప్తంగా ఒక్క జిల్లాలోకూడా అమలు చేయడం లేదు. పైగా ఈ విషయమై అన్ని జిల్లా పంచాయతీ అధికారులకు గ్రేడ్-5 కార్యదర్శిలు ఫిర్యాదులు చేసినా, జిఓనెంబరు 149ని తక్షణమే అమలు చేయాలని అర్జెంటు సర్కులర్ లు ఇచ్చి జిల్లా పంచాయతీ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎన్నో ఆశలతో ప్రజలకు గ్రామస్థాయిలో సేవలు చేద్దామని విధుల్లోకి చేరిన తమకు ప్రభుత్వ అధికారులు రిక్త హస్తం చూపిస్తున్నారని గ్రామసచివాలయ నూతన కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క అధికారం కూడా లేకుండా తాము ప్రజలకు ఏవిధంగా సహాయం చేయగలమని వీరంతా ప్రశ్నిస్తున్నారు. డిపీఓలు జీఓనెంబరు 149 తక్షణమే అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసినా, మండలస్థాయిలోగానీ, సచివాలయ స్థాయిలో ఈఓపీఆర్డీలుగానీ, సీనియర్ కార్యదర్శులు గానీ దీనిని అమలు చేయలేదని గ్రేడ్-5 కార్యదర్శిలు చెబుతున్నారు. జిల్లా అధికారుల ద్వారా తమ సమస్య పరిష్కారం కాదని నిర్ణయించుకున్న వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ముందుకు ఈ వి షయాన్ని తీసుకెళ్లారు. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది కావొస్తున్నా నేటికీ జీఓనెంబరు 149ని అమలు చేయకపోవడం, అధికారాలు బదలాయింపు చేయకపోవడంపై చాలా పెద్దే కుట్రే దాగివుందనే అనుమానాలను సైతం వీరు వ్యక్తం చేస్తున్నారు. అటు జిల్లా కలెక్టర్లుగానీ, జాయింట్ కలెక్టర్లు గానీ సచివాలయాల పర్యటనలకు వెళ్లినపుడు గ్రామసచివాలయ సిబ్బంది బాగా పనిచేసేయాలని హెచ్చరించడం తప్పితే, అధికారాలు లేని గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రజలకు ఏవిధంగా సేవలు అందించగలని ఒక్క అధికారికూడా గుర్తించకపోవడం శోచనీయమని రాష్ట్రవ్యాప్తంగా వున్న 7వేల మంది కార్యదర్శిలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్రుష్టికి వెళ్లిన తరువాతైనా...ఈ గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ప్రకారం అధికారాల బదాలయింపులు జరుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సి వుంది..!