తిరుమల పారాయణానికి 180 రోజులు..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 1
                            
                         
                        
                            
తిరుమల
                            2020-10-06 16:21:16
                        
                     
                    
                 
                
                     ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై టిటిడి చేపట్టిన పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం 180 రోజులు(6 నెలలు) పూర్తి చేసుకుంది. మంగళవారం జరిగిన సుందరకాండ పారాయణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలోని శ్రీ కాశీవిశ్వనాథస్వామివారి ఆలయ ప్రధానార్చకులు ఆచార్య శ్రీకాంత్ మిశ్రా పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లోని భక్తులు పెద్దసంఖ్యలో అనుసరించి తమ ఇళ్లలో పారాయణం చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.  మొదటగా "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వరకు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుందరకాండ పారాయణం ప్రారంభమై మంగళవారం నాటికి 118 రోజులు పూర్తి చేసుకుంది.