అక్టోబర్ 17 నుంచి దసరా మహోత్సవాలు ..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
కనకదుర్గ గుడి
                            2020-10-06 20:34:40
                        
                     
                    
                 
                
                    విజయవాడక కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అక్టోబరు 17 నుంచి ప్రారంభిస్తున్నట్టు దుర్గగుడి అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అమ్మవారు 9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 17న తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా, 19న శ్రీ గాయత్రీ దేవిగా,  20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా ,  21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా, 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా,  24న శ్రీ దుర్గాదేవిగా, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతోపాటు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించడానికి అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం కనిపిస్తోంది. రోజుకి ఎంతమందిని అమ్మవారి దర్శనానికి పంపాలనే విషయమై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ప్రకటించే అవకాశముంది.