శ్రీవారి సేవ పూర్వజన్మ సుకృతం..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 3
                            
                         
                        
                            
Tirumala
                            2020-10-10 16:54:34
                        
                     
                    
                 
                
                    తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని శ్రీవారి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. స్వామివారి ఆలయం లో ఈఓగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని నూతన ఆనందం వ్యక్తం చేశారు.  ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.  ఒక భక్తుడిలాగా స్వామివారికి సేవ చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నానని చెప్పారు. తిరుపతిలో తాను వెటర్నరీ సైన్సు విద్యను పూర్తి చేశానన్నారు. అలాంటి స్వామివారి ఆలయానికి ఈఓగా రావడం నిజంగా స్వామివారి కరుణగానే భావిస్తున్నానని చెప్పారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పుడున్న వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో టిటిడి జెఈఓ  పి.బసంత్ కుమార్, జెఈఓ(విద్య మరియు ఆరోగ్యం)  ఎస్.భార్గవి, సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, బోర్డు సభ్యులు  శివకుమార్, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, డెప్యూటి ఈవో ఆర్-1  బాలాజి, విజివో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.