దాతలు మరిన్ని కూరగాయలు అందించాలి..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Tirumala
                            2020-10-12 16:33:25
                        
                     
                    
                 
                
                    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు మరిన్ని రకాల కూరగాయలు సరఫరా చేయాలని కూరగాయల దాతలను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి కోరారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే కూరగాయలు సరఫరా చేసే దాతలతో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, దాతలు ఎంతో సహకారం అందిస్తున్నారని, 2004వ సంవత్సరం నుంచి నిరంతరాయంగా కూరగాయల సరఫరా జరుగుతోందని వివరించారు. ఈ నెల 16 నుండి 24వ తేదీ వరకు  తాజా కూరగాయలు సరఫరా చేస్తుండడంతో అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉంటున్నాయన్నారు. అన్నిరకాల కూరగాయలు సరఫరా చేయాలని కోరడంతో దాతలు అంగీకరించారని తెలిపారు. 2019-20వ సంవత్సరంలో 18.57 లక్షల టన్నుల కూరగాయలు విరాళంగా అందాయని, ఈ ఏడాది కోవిడ్ నిబంధనల కారణంగా సెప్టెంబరు నెల వరకు 1.65 లక్షల టన్నుల కూరగాయలను దాతలు విరాళంగా అందించారన్నారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డెప్యూటీ ఈవో  నాగరాజ, క్యాటరింగ్ అధికారి  జిఎల్ఎన్.శాస్త్రి, ఏఈవో  లోకనాథం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన 15 మంది కూరగాయల దాతలు పాల్గొన్నారు.