కనకమ్మ ఆలయంలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Kanaka Mahalaxmi temple
                            2020-10-17 19:23:40
                        
                     
                    
                 
                
                    ఉత్తరాంధ్రావాసుల ఇలవేల్పు విశాఖలోని బురుజుపేట శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శనివారం ఈ మేరకు ఆలయంలో నిర్వహించిన రాట మహోత్సవంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దుర్గమ్మ, కనకమహాలక్ష్మి అమ్మవార్లు కరుణతో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో నియంత్రణ జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్సవాలు నిర్వహించాలని ఈఓకి సూచించారు. ఆలయంలోకి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.