సింహ వాహనంపై  నరసింహస్వామిగా..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
తిరుమల
                            2020-10-18 10:32:25
                        
                     
                    
                 
                
                    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై అభయ ఆహ్వాన నరసింహస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.  శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.  రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,  చిప్పగిరి ప్రసాద్,  గోవిందహరి,  డిపి.అనంత, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  రమేష్‌రెడ్డి, ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన  వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.