వరద ప్రాంతాల్లో  సీఎం జగన్ ఏరియల్ సర్వే..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Prakasam Barrage
                            2020-10-19 20:49:47
                        
                     
                    
                 
                
                    ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన  ప్రాంతాలను ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన  రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా ఆయన ఇప్పటికే కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదల కారణంగా  4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరాల కోసం  వెంటనే 2250 కోట్లు సాయం అందించాల్సిందిగా ఆయన తన లేఖలో   కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా పంటనష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. బాగా వరదలు వచ్చిన ప్రకాశం బ్యారేజీ, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే క్రిష్ణాజిల్లా కలెక్టర్ ను ఆదేశించి బాదితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరావాస చర్చలు తీసుకోవాలాని ఆదేశించారు.