విద్యాలక్ష్మిగా శ్రీ కనకమహాలక్ష్మి..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Sri Kanaka Maha Lakshmi Temple
                            2020-10-21 15:01:33
                        
                     
                    
                 
                
                    శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖలో శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు బుధవారం విద్యాలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పుష్పయాగం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు.అనంతరం శ్రీచక్రనవార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ జె.మాధవి మాట్లాడుతూ, అమ్మవారి రూపాలను భక్తులు తిలకించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి, మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, అమ్మవారి దర్శనాలు కల్పించినట్టు ఆమె వివరించారు. నవరాత్రి ఉత్సవాల్లో దాతలు  కె.వీరభద్రరావు, ఎస్.రాము సహకారంతో అమ్మవారికి ఈరోజు అలంకరణ చేపడుతున్నట్టు ఈఓ వివరించారు.  కాగా రేపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు సంతాన లక్ష్మిగా దర్శనం ఇవ్వనున్నారు. అంతేకాకుండా అమ్మవారికి లక్ష తులసీ పూజ కూడా చేపడతామని ఈఓ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాంబాబు, పర్యవేక్షకులు త్రిమూర్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.