6500 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
Velagapudi
                            2020-10-21 20:03:55
                        
                     
                    
                 
                
                    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేదిక నుంచి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ ఉద్యోగ ప్రకటన శుభవార్త ప్రకటించారు. 6500 ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీచేయనున్నట్టు సీఎం ప్రకటించారు. పోలీస్ శాఖలో ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్ దృష్ట్యా, అదనంగా కావాల్సిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబరులో నోటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చామన్నారు. జనవరి నుంచి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీని కోరినట్టు సీఎం  వైయస్ జగన్ వెల్లడించారు. అదే విధంగా గత మూడు సంవత్సరాలుగా పోలీసు సంక్షేమ నిధికి ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకూ పోలీసు ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది..