చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడిగా..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 2
                            
                         
                        
                            
Tirumala
                            2020-10-22 21:06:56
                        
                     
                    
                 
                
                     శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం రాత్రి  శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్  కోన రఘుపతి ఈ వాహనసేవలో పాల్గొన్నారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. కాగా, బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనసేవ జరుగుతాయి. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, తెలంగాణ హైకోర్టు జడ్జి  అమర్‌నాథ్ గౌడ్, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు  ప్రశాంతిరెడ్డి, డా. నిశ్చిత చిప్పగిరి ప్రసాద్,  గోవిందహరి,  డిపి.అనంత,  సంపత్ రవి నారాయణ, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ  రమేష్ రెడ్డి, పేష్కార్  జగన్‌మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.