సింహాచల భూ సమస్య పై ప్రత్యేక కమిటీ..


Ens Balu
3
Velagapudi
2020-10-29 20:09:01

సింహాచలంలోని భూసమస్యపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు,  పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్,సీఎం సలహాదారు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, సింహాచల ఆలయ కార్యదర్శి సభ్యులుగా వుంటారు. వీరితోపాటు, ఎంపీలు విజయసాయిరెడ్డి, బి.సత్యవతి, దేవాదాయశాఖ కమిషనర్ కూడా సలహాదారులుగా ఉంటారు. ప్రభుత్వం సింహాచలం పంచగ్రామాల సమస్యపై ప్రకటించిన విధంగా కమిటీ ఏర్పాటు చేసింది. భూ సమస్యపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం పంచగ్రామాల సమస్య నిర్ణయం తీసుకుంటుంది. అదే సమయంలో జనవరి నుంచి జరగనున్న సమగ్ర భూ సర్వే కూడా ఈ భూసమస్యకు పరిష్కారం చూపించనుంది. సర్వేద్వారా దేవస్థానం భూములు ఎంత వరకూ ఉన్నాయి... ఆక్రమిత భూములు ఎంతవున్నాయనే విషయం కూడా తేలిపోనుంది. కాగా గత ప్రభుత్వంలో కమిటీ వేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా ప్రజా ధనం దుర్వినియోగం అయ్యింది..