వీర జవాన్ల త్యాగాలు మరువలేనివి..


Ens Balu
3
రెడ్డివారిపల్లె
2020-11-14 21:51:26

భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లె గ్రామానికి చెందిన వీర జవాన్ ప్రవీణ్  కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా జవాను చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాసులు పూతలపట్టు శాసనసభ్యులు ఎం ఎస్ బాబు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఆర్డిఓ రేణుక తో ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు వదిలిన జవాన్ ల త్యాగాలు మరువలేనివన్నారు. వారి కుటంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా వీర జవాన్ ప్రవీణ్ అమర్ రహే అమర్ రహే...జై జవాన్ జై జవాన్ అనే నినాదాలు మారు మ్రోగాయి..