ఏపీలో బదిలీలకు ఈసి బ్రేక్..


Ens Balu
3
Velagapudi
2020-11-18 15:56:03

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులకు ఒదొక బ్యాడ్‌ న్యూస్.. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలను రెండు నెలల పాటు నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు, ఆర్డీవోలు, ఇతర రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ కీలక శాఖల్లోని సిబ్బందికి రెండు నెలల పాటు బదిలీలు నిలిపివేసింది ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని చేపడతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఉండడంతో.. ఆ ప్రక్రియకు సంబంధించిన శాఖల ఉద్యోగులెవరినీ బదిలీ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో బదిలీలకు బ్రేక్ పడక తప్పలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదేశాల మేరకు ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రత్యేక సవరణ కార్యక్రమం నవంబరు 16 నుంచి జనవరి 15 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసి ఈ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎన్నికల అధికారులు, డిప్యూటీ ఎన్నికల అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధమున్న అధికారులెవరినీ బదిలీలు చేయకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా రిటర్నింగ్‌ అధికారులుగా కలెక్టర్లు, ఉపరిటర్నింగ్‌ అధికారులుగా జేసీలు, ఆర్డీవోలు ఉంటారు. అలాగే రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ యంత్రాంగం మొత్తం ఇందులో పాలుపంచుకోవలసి ఉండడంతో ఆయా శాఖల్లోనూ బదిలీలు ఉండవు. ఒకవేళ ఎవరినైనా అత్యవసరంగా బదిలీ చేయాల్సి వస్తే.. ముందుగా ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఈసి నుంచి అనుమతులు తీసుకోవడానికి సైతం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్పా అటు ఈసీ కూడా బదిలీలను ప్రోత్సహించే పరిస్థితి లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జాయింట్‌ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్‌వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శులు, బూత్‌ స్థాయి ఆఫీసర్ల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుని.. ఇంకా ఖాళీలుంటే ఆ వివరాలతో నివేదిక పంపించాలని ఆదేశించారు. ఇప్పటికే మిగిలిన పోయిన గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది వేగంగా జరుగుతుండగా, వీఆర్ లో ఉన్న ఉద్యోగులను తక్షణమే ఖాళీలు ఉన్నచోట ప్రభుత్వం నియమిస్తోంది...