రాధాక్రిష్ణ జర్నలిజం ముగులో టిడిపికి కొమ్ముకాస్తున్నాడు..


Ens Balu
1
Visakhapatnam
2020-11-20 16:01:40

జర్నలిజం ముసుగు వేసుకొని ఒక పార్టీకి  వేమూరి రాధాకృష్ణ కొమ్ము కాస్తున్నారంటూ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ,  విశాఖ ఎయిర్ పోర్ట్‌పై తమ పచ్చపత్రిక ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఖలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేవేయలని ఉంది. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై రామోజీరావు, రాధాకృష్ణ తో చర్చించాలా. రెండు ఎయిర్ పోర్ట్‌ల మధ్య ఎంత దూరం ఉండాలో తెలియదా.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కాదు నేవి ఎయిర్ పోర్ట్. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో నావీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ మూసేశారని గుర్తుచేశారు. రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వారు సమతుల్యం పాటించాలన్న ఆయన రాధాకృష్ణ టివి ఛానెల్, దినపత్రిక నడపడానికి అనర్హుడని విరుచుకుపడ్డారు.. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై నాతో చర్చకు వస్తే అన్ని విషయాలు చర్చిస్తాను. అంతేతప్పా ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి జనాలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా పరిశ్రమల అభివృద్ధికి మేము సిద్ధంగా ఉన్నాము. విశాఖ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారు. టీడీపీ అధికార ప్రతినిదిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నిలు చంద్రబాబు పెట్టమంటే పెడుతున్నారు. వద్దంటే మానేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు.