కూర్మనాథుని ఆలయంలోనూ నిత్యాన్నదానం..


Ens Balu
2
Srikurmam
2020-11-20 21:03:51

శ్రీకాకుళం జిల్లాలోని  శ్రీకూర్మనాధస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్.విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆ రోజు ఉదయం 9.30 గం.లకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా దాతలచే సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  భక్తులు సమర్పించు నిత్య అన్నదాన పథకానికి చెక్కులు గాని, డిడిల రూపంలో గాని నేరుగా దేవస్థానం బ్యాంకు ఖాతా నెం. 73166770127, ఐఎఫ్ఎస్ సి కోడ్ ఎపిజివిబి 0001170 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, శ్రీకూర్మం, గార మండలం, శ్రీకాకుళం జిల్లా కు జమ చేయవలసి వుంటుందని చెప్పారు.  నగదు రూపంలో చెల్లించు సమర్పణలు నేరుగా దేవస్థానం కార్యాలయం  నందు చెల్లించి తగు రశీదు పొందవలసినదిగా కోరినారు.  భక్తులు అన్నదాన పథకంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.