డా.వైఎస్సార్ జిల్లాలోని గండికోట పర్యాటక అందాలు..


Ens Balu
3
gandikota
2020-11-24 12:23:49

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కడపజిల్లాలోని గండికోట ప్రాంతం. ఇక్కడ కోట, పెన్నానదీ ప్రవాహక ప్రాంతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  ఈప్రాంతాన్ని సందర్శించిన వారంతా ఏదో విదేశాల్లోని కౌ బాయ్ సినిమాను చూసినట్టుగా అనుభూతి పొందుతారు. గండికోట కూడా చూడ ముచ్చటగా వుంటుంది. అదే సమయంలో పెన్నా నదీ ప్రాంతం నుంచి చూస్తున్న ప్రాంతంలో కొండలు కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. గండికోటను గ్రాండ్ కెన్యన్ గా అభివర్ణిస్తారంటే ఇక్కడి పర్యాటక అందాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా ఈ ప్రవాహం చూడటానికే చాలా అందంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని చూడాల్సిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గంటి కోట ఒకటి.