శాస్త్రోక్తంగా అమ్మవారి రాట ముహూర్తం..
Ens Balu
2
KANAKAMAHALAKXHMIGUDI
2020-11-25 16:13:46
ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేలుపు శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల రాట ముహూర్తం విశాఖలోని ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఈఓ జె.మాధవి, ఏఈఓ వి.రాంబబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో ఉంచుకొని అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కారోనా వైరస్ సూచనలు భక్తులకు తెలియజేస్తూ, అమ్మవారి దర్శనాలు కల్పించాలన్నారు. ఈఓ మాధవి మాట్లాడుతూ, అమ్మవారి రాట కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళలకు తీర్ధ ప్రసాదాలతోపాటు జాకెట్టు ముక్కలు, తాంబూలం పంపిణీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు, శ్రీనివాస్, రాంబాబు, రామారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.