అసంపూర్తి రహదారులపై దృష్టి సారించాలి..


Ens Balu
2
Vijayawada
2020-11-25 19:29:56

అసంపూర్తిగా మిగిలిపోయిన రహదారి పనులను వచ్చే ఏడాది మార్చి 31 వ తేదీ లోపున నిధులు మురిగిపోకుండా పూర్తి చేస్తే బాగుంటుందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. బుధవారం తాడేపల్లిలో పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కార్యాలయం నుంచి  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి  హామీ పథకం అమలు తీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా  మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, నాడు-నేడు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సి.సి. రోడ్లు నిర్మాణం, గ్రామ సచివాలయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఆరు వారాలలో ప్రతీ వారం చేపట్టవలసిన పనులపై  ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని నిర్ధేశించిన లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు. మంత్రి పేర్ని నాని మచిలీపట్నం లోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, ఈ ఏడాది జులై , అక్టోబర్ మాసాల్లో పేమెంట్లు ఇచ్చారని ప్రతి నెల ఆయా మొత్తం మంజూరైతే , ఆయా పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. అదే విధంగా సిమెంట్ కావాలని ఇండెంట్ సమర్పించి ఎఫ్ టి ఓ  జనరేట్  కాబడి పేమెంట్ జాప్యం అవుతుందన్నారు. కృష్ణాజిల్లాలో ఒక చిన్న సిమెంట్ కంపెనీకు  పంపిణీ అప్పచెప్పడం వలన సిమెంట్ త్వరితగతిన అందడం లేదన్నారు. తమ జిల్లాలో ఇప్పటకీ  6 వేల టన్నుల సిమెంట్ పంపిణీ కావాల్సి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విధానంలో జాప్యం నివారించడానికి పంచాయితీరాజ్ శాఖ నంచి నగదు నేరుగా సిమెంట్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ఖాతాలోకి జమ చేస్తే, సిమెంట్ త్వరితగతిన సరఫరా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించాలని ఆయన కోరారు.  5 లక్షల లోపు నగదు ఒక వారం లోపున పేమెంట్ అవుతుందని అదే కనుక 5 లక్షల రూపాయలు డబ్బు దాటితే, అవి పేమెంట్ కావడానికి రెండు మూడు నెలల జాప్యం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో యస్ఆర్ ఇజియస్ క్రింద 120 లక్షల పనిదినాలు సాధించాలని లక్ష్యంగా తీసుకున్నప్పటికీ మార్చినాటికి 150 లక్షల పనిదినాలు కల్పించే దిశగా ప్రణాళిక అములు చేస్తున్నానున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 107.95 లక్షల పనిదినాలు సాధించగా, డిశంబరులో ఈ లక్షలు. జనవరిలో 10 లక్షలు, ఫిబ్రవరిలో 12 లక్షలు. మార్చిలో 14 లక్షలు పాధించేదికగా వెళుతున్నామన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ క్రింద రూ. 188.85 లక్షలకు గాను. రూ. 93.32 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా జిల్లాలో 809 గ్రామ సచివాలయాలు. 796 రైతులరోపాకేంద్రాలు, 658 వైయస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 1069 ప్రహరీ గోడల నిర్మాణం, 367 అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలను మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని గ్రామీదాలివృద్ధి శాఖా మంత్రికి కలెక్టరు వివరించారు. ప్రతినెలా 150 గ్రామసచివాలయాలు. 200 రైతుభరోసా కేంద్రాలు, 170 దైయస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఈ లక్ష్యసాధనకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది స్టేట్ కన్వర్టెన్సీ ఫంగ్ క్రింద రూ. 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు కలెక్టరు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో రూ.10 కోట్ల మేర రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.