ఏయూ వీసిగా ఆచార్య పివిజిడి ప్రశాదరెడ్డి..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-26 08:22:51

అనుకున్నదే అయ్యింది..కొందరు పనిగట్టుకొని ఆయన వీసిగా అర్హులు కారని  ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.. ప్రభుత్వం మాత్రం ఆయనే ఏయూ విసీగా అర్హుడంటూ గుర్తించింది. ఆపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దస్త్రంపై సంతకం చేశారు.. దీనితో ఆర్తనాదాలు చేసిన వారి గొంతులో పచ్చివెలక్కాయ్ తోపాటు అన్నీ పడ్డట్టు అయ్యింది. అందరి కోరిక, ఆకాంక్ష మేరకు చదువులమ్మ ముద్దుబిడ్డ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్‌ ‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్‌ ‌బిశ్వబూషన్‌ ‌హరిచందన్‌ ఆమోదంతో నూతన వీసీగా ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల కాలం ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2019 జూలై మాసం నుంచి ఆచార్య ప్రసాద రెడ్డి ఏయూకు ఇంచార్జి వీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో వీసీగా బాధ్యతలను చేపట్టనున్నారు.