ఆచార్య టు వైస్ చాన్సలర్@ ప్రసాదరెడ్డి..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-26 17:53:43

ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఆచార్యునిగా, పరిపాలనా దక్షునిగా, కంప్యూటర్‌ ‌సైన్స్, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ నిపుణుడిగా ఆంధ్రాయూనివర్శిటీలో ఎందరో విద్యార్ధులకు సుపరిచితులు. ఆయన ఏయూ కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగంలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా 1987లో ఉద్యోగ బాధ్యతలను చేపట్టి సీనియర్‌ ‌ప్రొఫెసర్‌గా నేడు సేవలు అందిస్తున్నారు. గతంలొ ఆచార్య ప్రసాద రెడ్డి 2008-2011 వరకు రిజిస్ట్రార్‌గా, 2011-2012 వరకు వర్సిటీ రెక్టార్‌గా, కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగాధిపతిగా, వర్సిటీలో పలు పరిపాలనా పరమైన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఆచార్య ప్రసాదరెడ్డి వేలాది మంది విద్యార్థులను మలచిన స్ఫూర్తిదాయక ఆచార్యునిగా పేరుగాంచారు. ఆయన 33 సంవత్సరాలుగా బోధన వృత్తిలో కొనసాగుతున్నారు. ఆచార్య ప్రసాద రెడ్డి పర్యవేక్షణలో 47 మంది డాక్టరేట్‌లు అందుకున్నారు. ఆయన 195కిపైగా పరిశోధన పత్రాలను జాతీ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు. రెండు పేటెంట్లను,  వీటికి పలు అవార్డులు సైతం రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ, డేటా సైన్స్ ‌రంగాలలో అత్యంత ప్రముఖ పరిశోధకుల్లో ఆయన ఒకరుగా నిలచారు. ఆచార్య ప్రసాద రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2011 సంవత్సరంలో ఉత్తమ ఆచార్యునిగా అవార్డును స్వీకరించారు. ఆచార్య ప్రసాదరెడ్డి బోధన, పరిశోధన రంగాలతో పాటు పరిపాలనా రంగంలో సైతం తనదైన సమర్ధతను ఆయన చాటుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌, ‌రెక్టార్‌గా పదవులను పూర్తిచేసిన అనంతరం, విభాగాధిపతిగా కొనసాగడం ఆయన ప్రత్యేకత. నిత్యం బోధన చేస్తూ విద్యార్థులకు మార్గదర్శకం చేస్తూ పూర్తిస్థాయిలో ఉపాదిని కల్పించే దిశగా కృషిచేసారు. నేడు ఆంధ్రాయూనివర్శిటీ పూర్తిస్థాయి కులపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ టీమ్ నుంచి అభినందనలు తెలియజేస్తుంది.