ఇక గ్రామాల్లోనే ప్రాధమిక ఆరోగ్యం..


Ens Balu
2
Velagapudi
2020-11-29 11:57:10

గ్రామాల్లోనే నిరుపేదలకు ప్రాధమిక వైద్యం అందాలి.. పల్లెలు బాగుంటునే రాష్ట్రం శుభిక్షంగా వుంటుంది.. ఇవీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాటలు, ఆశయం..ఇపుడు ఆయన మాటలను తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిజం చేయబోతున్నారు. డా.వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల పేరుతో ప్రతీ గ్రామంలోనూ ఒక క్లినిక్ ని ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8585 క్లినిక్ లను ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భవన నిర్మాణాలు కూడా పూర్తి అయ్యాయి. 2500 మంది జనాభాకి ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటవుంది. అక్కడే 90 రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే పూర్తిస్థాయి ప్రాధమిక వైద్యం గ్రామంలోనే అందుతుందన్నమాట. ఇకపై కన్ను నొప్పి, కడుపునొప్పి, విరేచనాలు,  ఒళ్లునొప్పులు, ఇలా అన్ని ప్రాధమిక రుగ్మతలకు గ్రామంలోనే వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో ప్రభుత్వం మందులు అందుబాటులోకి తెస్తుంది. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు లేని గ్రామసచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక స్టాఫ్ నర్సు, ఒక ఆరోగ్య సహాయకులు ఉండి ప్రజలకు వైద్యసేవలు అందిస్తారు. గర్భిణీలకు కూడా ఇక్కడే వ్యాక్సిన్లు వేస్తారు. చిన్నపిల్లలకు  టీకాలను కూడా ఈ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలోనే అందుబాటులో ఉంచుతారు. ఒక రకంగా చెప్పాలంటే తల్లీబిడ్డా ఆరోగ్యాన్ని ఇక్కడే చూపించుకోవచ్చు. ప్రాధమిక వైద్యం దాటే అన్ని రోగాలను ఇక్కడి నుంచి పీహెచ్సీకి, అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రులకు వైద్యులు రిఫర్ చేస్తారు. డాక్టర్ వైఎస్సార్ కలలు గన్న గ్రామస్థాయిలో ప్రాధమిక వైద్యం మార్చి నెల నుంచి గ్రామసచివాలయాల్లో అందుబాటులోకి వస్తుంది. తరువాత ప్రత్యేకంగా నిర్మించిన కొత్తభవనాల్లోకి మార్చడానికి ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసింది. వైఎస్సార్సీపీపి ప్రభుత్వంలో ఇక వైద్య సేవలు కూడా ఇంటి ముంగిటకే రానున్నాయన్నమాట.