అసెంబ్లీలో గీతం భూ దురాక్రమణలు చర్చకొచ్చేనా..?
Ens Balu
4
Velagapudi
2020-11-29 14:20:19
విశాఖ రుషికొండ ప్రాంతంలోప్రభుత్వానికి చెందిన రూ.800 కోట్లు విలుచేసే 40.50 ఎకరాల రెవిన్యూభూమిని దురాక్రమణ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పుడు ద్రువీకరణలు చూపిన విషయంలో గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీకి అన్నిదారులు మూసుకుపోతున్నట్టే కనిపిస్తుంది.. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ రద్దు బిల్లు చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీ లెజిస్లేచర్ బిల్లుతోనే గీతం ప్రైవేటు యూనివర్శిటీ బిల్లు పాస్ అయ్యింది. ఇపుడు అదే గీతం ప్రభుత్వ ఆస్థిని దురాక్రిమించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేసిందనే అభియోగాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇటు గీతం అవినీతి, భూ దురాక్రమణ, తప్పుడు ద్రువీకరణలపై ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి యుజిసి, ఎంఎంసీ, ఏఐసిటిఈలకు ఆధారాలతో ఫిర్యాదు చేసి గుర్తింపుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇపుడు తాజాగా రాష్ట్రప్రభుత్వం ఇదే విషయాన్ని అసెంబ్లీ ద్రుష్టికి తీసుకెళ్లి ప్రత్యేక తీర్మాణం చేయనున్నట్టు కూడా చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ఏదైన ఒక విషయానికి చట్టబద్దత తీసుకురావాలంటే అసెంబ్లీలో తీర్మాణం ఏర్పాటు చేసి దానిని చట్టం చేస్తుంది. అదేవిధంగా ఒక ప్రైవేటు డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ఏకంగా ప్రభుత్వ భూములను ఆక్రమించడంతోపాటు, వాటిని సొంత ఆస్తులుగా చూపి యుజిసి, ఎంఎంసీ, ఏఐసిటిఈ, నేక్ ల నుంచి గుర్తింపు కూడా పొందిన విషయాన్ని ఆధారాలతో అసెంబ్లీ ద్రుష్టికి కూడా తీసుకు రానుందని సమాచారం అలా చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ గీతం భూ దురాక్రమణ కళ్లకు కట్టినట్టు చూపించనున్నారు. ఇప్పటికే గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ ప్రభుత్వానికి చెందిన భూమిని ఆక్రమించిన తరుణంలో కొంత భూమిని స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన ఆక్రమిత ప్రాంతంలో అనుమతులు లేని కట్టడాలను కూలగొట్టే ప్రయత్నంలో గీతం రాత్రికి రాత్రే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివిషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, గీతం అవినీతి వ్యవహారంలో ఆధారాలన్నీ ఒక పెద్ద ఫైలుగానే సేకరించి పెట్టినట్టు సమాచారం అందుతోంది. రాష్ట్రప్రభుత్వం సేకరించిన ఆధారాలు ఒక్కసారి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రాస్తావిస్తే...ఏ మేర గీతం అవినీతికి పాల్పడింతో పూర్తిస్థాయిలో తేలనుంది. అంతే కాకుండా ఏదైనే యూజిసి నిబంధన ద్వారా ఏపి లెజిస్లేచర్ లో ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు పాసై యూజిసికి వెళ్లిందో..అదే విధానం ద్వారా అదే లెజిస్లేచర్ లో గీతం రద్దు బిల్లు ఆమోదిస్తే..దానిని యూజిసి గుర్తించాల్సి వస్తుంది. అలా గుర్తిస్తే గీతం డీమ్డ్ యూనివర్శిటీ గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అవినీతి వ్యవహారం నుంచి బయట పడదామనుకున్న భూ దురాక్రమిత గీతంకు అన్ని దారులు మూసుకుపోతున్నట్టే కనిపిస్తున్నాయి. అదే సమయంలో గీతంలోని విద్యార్ధులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారిని ఆంధ్రాయూనివర్శిటికీ అటాచ్ చేయాలని కూడా ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదులో కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరారు. దానివలన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ అనుమతులు రద్దు చేసే క్రమంలో విద్యార్ధులకు ఎలాంటి నష్టమూ జరగదని కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది భూ ఆక్రమిత గీతం తెరపై చూడాల్సిందే..!