వేతన సంఘ సిఫార్సులు అమలు చేయాలి..


Ens Balu
3
Machilipatnam
2020-11-29 15:42:14

వేతన సంఘం చేసిన సిఫార్సులను అమలు చెయ్యకుండా అనేక మార్గాల్లో మేనేజ్మెంట్లు దారులు వెతుకుతున్నాయని, సక్రమంగా అమలు చేసేందుకు ఫిబ్రవరిలో ఢిల్లీలో సమావేశమై ఒక కార్యా చరణ పధకం రూపొందించేందుకు  "అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ " (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్) సమాయత్తం కావాలని నిర్ణయించింది. ఈ రోజు ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ నిర్వహించిన జూమ్ సమావేశం అధ్యక్షులు శివకుమార్ సింగ్ ఠాకూర్(నాగపూర్) అధ్యక్షత వహించారు.ప్రదాన కార్యదర్శి వి.బాలగోపాలన్ (తిరువనంతపురం) మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న జర్నలిస్టులను, నాన్ జర్నలిస్టులను ఆదుకోవాల్సిన పలు మీడియా హౌస్ ల యాజమాన్యం ఉద్యోగులను తొలగించడం,జీతంలో కోటవిధించటం చాలా బాధాకరం అన్నారు. వేజ్ బోర్డ్ వేతనాలు అమలు కోసం పాత్రికేయులు,పాత్రికేయ ఇతరుల సమాచారాన్ని సేకరించడం జరుగుతోందని,అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్యను సేకరించాలని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఠాకూర్,బాలగోపాలన్ లు అన్ని రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులని కోరారు.అలాగే ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు,కర్ణాటకల లో ఫెడరేషన్ ని మరింత బల పరచి,ఆ రాష్ట్రాల్లోని జర్నలిస్ట్,నాన్ జర్నలిస్ట్స్ సమస్యలను పరిష్కరించాలని సీనియర్ జాతీయ ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర రావు ని ఆదేశించారు. జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు సీహెచ్ పూర్ణచంద్ర రావు (విజయవాడ)  నుండి ఈ జూమ్ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోప్రముఖ తెలుగు డైలీ విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ తో సహా 30 మంది వరకు కోవిడ్ మహమ్మారి భారిన పడి మరణించారని,వారి కుటుంబాలకు ఒక్కరికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. అలాగే దేశంలోనే ఏకైక ఇంగ్లీష్,హిందీ,ఉర్దూ భాష లలో వార్తలను అందిస్తున్న జాతీయ వార్తా సంస్థ "యూ ఎన్ ఐ "  యాజమాన్యం లోప భూఇష్టమైన నిర్ణయాలతో క్లిష్టమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయి ఉద్యోగులకు 45 నెలల జీతాలు బకాయిలు పడిందని,ఇలాంటి స్థితిలో ఎంతో కొంత ఆర్ధిక చేయూత కల్పిస్తున్న ప్రసారభారతి తన సబ్స్క్రిప్షన్ విరమించుకోవటం తో మరింత సంక్షోభం లోనికి నెట్ట బడిందని,వెంటనే కేంద్ర ప్రభుత్వం  ప్రసార భారతి సబ్స్క్రిప్షన్ ని పునరుద్ధరించాలని,దేశంలోనే ప్రతిస్టాత్మక వార్తా సంస్థలు  పి టిఐ,యూ ఎన్ ఐ లను జాతీయం చేసి , ఒకే గొడుగు క్రిందకు తెచ్చి గతంలో లాగా "సమాచార్"గా మార్చి వాటిని ,వాటిలో పనిచేసే జర్నలిస్ట్స్, నాన్ జర్నలిస్టులను ఆదుకునేలా  ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ తగిన కార్యాచరణ పధకం రూపొందించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు.ఈ జూమ్ సమావేశంలో  ఇంకా ఎం.పెరుమాళ్(   చెన్నై), దేబశిష్ (కలకత్తా) పీయూష్ కుమార్ (ఢిల్లీ) ఇంద్రకుమార్ భద్ర,శశికళ శ్రీవాత్సవ్(ముంబై) గోపన్ నాంపట్టు, మ్యాచుస్(కేరళ) లతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని వివిధ సమస్యలపై ముఖ్యంగా కోవిడ్ 19 ద్వారా ఎదుర్కొకొంటున్న ఆర్ధిక సమస్యలను చర్చించారు.