ప్రజాప్రతినిధుల భద్రతపై రెండో కోణం..


Ens Balu
3
Velagapudi
2020-11-30 12:55:15

ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పేర్నినానిపై క్రిష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. మిగిలిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ప్రజాప్రతినిధుల దగ్గరకు ప్రజలు నేరుగా వెళ్లి అర్జీలు ఇచ్చేవారు కానీ పేర్నినానిపై జరిగిన హత్యాయత్నం తరువాత ఇక నుంచి అర్జీలు భద్రతా సిబ్బంది మాత్రమే తీసుకునే చేయాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధులకు భద్రత కట్టుదిట్టం చేయకపోతే పోలీసు వైఫల్యంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే అవకాశం వున్నందున నిఘావర్గాలను సైతం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటనలో భాగస్వామ్యం చేయనున్నారని సమాచారం. అలా చేయకపోతే అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల దగ్గరకు ఎవరు వస్తున్నారు, ఎవరేంచేస్తున్నారనే విషయం అర్ధం అయ్యేలోపే ప్రమాధాలు సంభవిస్తాయని కూడా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అయితే ప్రజాప్రతినిధుల భద్రతను పెంచుతారా లేదంటే ఉన్నవారినే జాగ్రత్తగా ఉండేలా చేస్తారా...టార్గెట్ లో ఉన్న మంత్రులకు గన్ మేన్ లను పెంచుతారానే అనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది..