మహిళల రక్షణే ధ్యేయంగా మహిళా మార్చ్..


Ens Balu
2
Velagapudi
2020-11-30 14:53:47

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ‘వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌’ను తన కార్యాలయంలో విడుదల చేశారు. ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్‌, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్‌ నంబర్లపై ...మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నకార్యక్రమం కోసం ఈబ్రోచర్ ఆవిష్కరణ చేపట్టారు. 100 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్‌ నేరాలపై మహిళా కమిషన్‌ అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ ఆర్కే రోజా,  వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ సుయజ్‌ తదితరులు  పాల్గొన్నారు.