డిసెంబరు 6న సుందరకాండ పారాయ‌ణం..


Ens Balu
2
Tirumala
2020-12-05 08:20:59

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై డిసెంబరు 6వ తేదీ 7వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆదివారం ఉద‌యం 7 గంటల నుంచి సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న 194 శ్లోకాలను పారాయణం చేస్తారు. కాగా, సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గ‌లకు గాను 2821 శ్లోకాలు ఉన్నాయి. ఈ మొత్త‌న్ని 16 విడ‌త‌లుగా టిటిడి అఖండ పారాయ‌ణం చేయ సంక‌ల్పించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు విడ‌త‌ల్లో అఖండ పారాయ‌ణం జ‌రిగింది. ఆదివారం జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, టిటిడి వేదపారాయణదారులు పాల్గొంటారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరుతోంది.