6 నుంచి '' బాలాలయ మహాసంప్రోక్షణ ''


Ens Balu
3
Tirumala
2020-12-05 08:24:15

తిరుమలలోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 6 నుంచి 10వ తేదీ వరకు  ''బాలాలయ మహాసంప్రోక్షణ'' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది.  ఈ కార్యక్రమానికి డిసెంబ‌రు 5వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది.  ఆలయంలోని యాగశాలలో డిసెంబ‌రు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. దీనికోసం టిటిడి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీఏటా డిసెంబరు మాసంలో స్వామి '' బాలాలయ మహాసంప్రోక్షణ '' చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు.