వేంకటేశ్వర ఆలయానికి స్థల పరిశీలన..


Ens Balu
2
రుషికొండ
2020-12-11 22:03:59

విశాఖలోని  ఋషికొండ వద్ద శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం  నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ను టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి  మాట్లాడుతూ ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి కానుందని , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చే  ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మిగిలివున్న పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణం  ప్రశాంతమైన సముద్రతీరంలో 10 ఎకరాల స్థలం లో నిర్మిస్తున్నామని  ప్రధాన ఆలయం  ఒకటిన్నర ఎకరా ల్లో వుంటుందన్నారు. మిగతా స్థలం పార్కింగ్ కేటాయించాం. ఆలయానికి వాడే రాయి మొత్తం కోటప్పకొండ రప్పించినట్లు చెప్పారు.   పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి  ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి రూ.28 కోట్లతో నిర్మించడం జరుగుతుందన్నారు. స్వామి వారి అనుగ్రహంతో నిర్మించడం జరుగుతుందన్నారు. ఆధ్యాత్మికంగా , అంతర్జాతీయ నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ  ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు,విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, ఇతర స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.