ఆర్జెయూకెటి 2020 ఫలితాలు విడుదల..


Ens Balu
3
Vijayawada
2020-12-12 21:49:48

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2020 ప్రవేశ పరీక్షకు మంచి స్పందన వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని నేపథ్యంలో ఆర్ జియుకెటి 2020 ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించామని, వీటికి విద్యార్దులు వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందని మంత్రి  పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్.అండ్.బి భవన సముదాయంలో పత్రికా విలేకర్ల సమావేశంలో ఆర్.జియుకెటి 2020 సెట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 30 వేల మందికి పైగా విద్యార్దులను 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత చేయడం జరిగిందన్నారు. విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా ఆర్ జియుకెటి సెట్ ను నిర్వహించామన్నారు. ఈ పరీక్షలకు అక్టోబర్ 23 తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 28 నుండి నవంబర్ 16 వరకు అప్లికేషన్లు స్వీకరించామన్నారు.  మొత్తం 88,974 మంది దరఖాస్తు చేసుకోగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 85 వేల 755 మంది హాజరైయ్యారన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 630 పరీక్షా కేంద్రాలోను, తెలంగాణ రాష్ట్రంలోని 8 కేంద్రాల్లో డిసెంబర్ 5వ తేదీన ఉదయం 11గం.ల నుండి మ.1.00 గంట వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు ఆర్ జియుకెటి ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి, హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డిల కృషి, మార్గదర్శకం ఎంతో అభినందనీయమన్నారు. జనవరి 4 నుండి విద్యార్దులకు కౌన్సిలింగ్ ప్రారంభిస్తామన్నారు. జనవరి రెండవ వారం నుండి తరగతులు ప్రారంభించడానికి కార్యాచరణ సిద్దం చేశామన్నారు. అర్హత సాధించిన విద్యార్దులకు, పరీక్షకు హాజరైన విద్యార్దులకు ఆర్.జియుకెటి వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  విద్యార్దులకు కటాఫ్ మార్కులు కాల్ లెటర్లు పంపడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వెబ్‌సైట్ నుండి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చని, కేవలం హాల్‌టికెట్ నెంబరు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. గుంటూరుకు చెందిన గుర్రం వంశీకృష్ణ(దాచేపల్లి ఏపి మోడల్ హైస్కూలు)99 మార్కులతో ప్రథమస్దానంలో నిలిచారన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాకు చెందిన పోతుంగంట జాకీర్ హుస్సేన్ రెండవ స్దానంలో నిలిచారన్నారు. డోలేపేట జడ్‌పి హెస్కూల్ రాజాంకు చెందిన ఐ.ఎస్ ఆర్యాయుగంధర్ మూడవస్దానంలో నిలిచారన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాలపై అభ్యంతాలు స్వీకరించడం జరిగిందని 1900 అభ్యంతరాలు రాగా ఫిజిక్స్, మ్యాథ్స్‌కు సంబంధించి రెండు తప్పులను పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు.  ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఎంపికైన విద్యార్దుకు 6 సంవత్సరాల సమీకృత బీటెక్ ప్రోగ్రామ్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా యూనివర్సిటీ గుంటూరు, శ్రీ వెంకటేశ్వర వెటర్నటీ యూనివర్శిటీ తిరుపతి మరియు డా.వైయస్ ఆర్ హార్టీకల్చర్ వెంకట్రామ గూడెం 2020-21 విద్యా సంవత్సరానికి డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్షా ఫలితాలను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా విడుదల చేయడం జరిగిందని, కరోనా పరిస్దితుల నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారాను, యూట్యూబ్ ద్వారా విద్యార్దులకు క్లాసులు నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు నిర్వహణకు ఎంత ప్రయత్నించినా సాధ్యంకానందున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను 2020 నిర్వహించి విద్యార్దుల విద్యాసంవత్సం కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఇంటర్ ప్రవేశాలు.. రాష్ట్రంలో 6 లక్షల 30 వేల మంది విద్యార్దులకు 10వ తరగతి నుండి ఉత్తీర్ణణ చెయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించని మార్గదర్శకాలకు అనుగుణంగా పై#్రవేట్ కాలేజ్‌లు విద్యార్దులను జాయిన్ చేసుకోవలసి ఉంటుందని, విద్య అనేది వ్యాపారం కాదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు లభించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పసరిగా పాటించాలని ఈ ఏడాది కొత్తగా 300 కాలేజ్‌లను ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చామన్నారు.