మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం..
Ens Balu
2
Tirumala
2020-12-15 20:28:06
పవిత్రమైన ధనుర్మాసం సందర్బంగా మంగళవారం ఉదయం మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం తిరుమల నాద నీరాజన వేదిక మీద ప్రారంభమైనది. ఈ కార్యక్రమం జనవరి 14వ తేదీ దాకా రోజు ఉదయం 6 నుంచి 6-45 గంటల వరకు నిర్వహిస్తారు. ''మాసానాం మార్గశిర్షోహం'' అన్నవిధంగా మాసాలలోకి అత్యున్నతమైన మార్గశిర మాసంలో శ్రీ మహా విష్ణువు కథలు వినటం వలన ముక్తి లభిస్తుందని ధర్మగిరి వేద పాఠశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు తెలిపారు. ఇందులో భాగవతం, విష్ణు పురాణంలోని కథలు శ్రవణం చేస్తూ, స్వామిని ధ్యానించినట్లయితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో, సమస్త సిరి సంపదలతో, ధన, ధాన్యాదులతో సుఖ మయ జీవితాన్ని పొందుతారన్నారు. టిటిడి మార్గశిర మాసంలో విష్ణు వైభవ ప్రవచనం కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.