బిసిలకు వైఎస్సార్సీపీలోనే పెద్దపీట..
Ens Balu
2
Vijayawada
2020-12-17 20:31:34
విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన బి.సి. సంక్రాంతి (బి.సి. ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం) కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. రాష్ట్రముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతీరావుపూలె, మాజీముఖ్యమంత్రి, దివంగతనేత వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 56 బిసి కార్పోరేషన్‌ల ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించారు.ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి సిహెచ్. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బి.సి.లను కల్చర్ ఇండియాగా గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి దేశంలోనే ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించుకుంటున్న బి.సి. సంక్రాంతి చారిత్రాత్మక సంక్రాంతిగా నిలుస్తుందన్నారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రిగా ఈఅద్భుతమైన అవకాశం రావడం మరిచిపోలేని ఘట్టమని ఇందుకు ముఖ్యమంత్రికి మనస్పూర్తిగా బిసిల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. 18 నెలలక్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదిక సాక్ష్యంగా బిసిల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేయడం బిసిల పట్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయని అన్నారు. బిసిలు అంటే భారత దేశ సాంస్కృతిక అన్న నాయకుడు సియం జగన్మోహనరెడ్డి అని అన్నారు. 56 బిసి కార్పోరేషన్‌లు, 672 డైరెక్టర్ల పోష్టుల్లో మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. బి.సి.ల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి జగన్మోహనరెడ్డి అని, బిసి అధ్యాయన కమిటితో వెనుకబడిన కులాలు గుర్తించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టలు తెలుసుకున్న నేత సియం జగన్ అని పేర్కొన్నారు.
శాసనమండలి సభ్యులు, బిసి కులాల అధ్యయన కమిటి ఛైర్మన్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలో అన్నివర్గాలు అభివృద్ధే దేశ అభివృద్ధి అని డా. అంబేద్కర్ తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఆశయాలతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ జనరంజక పాలన సాగిస్తున్నారన్నారు. బిసి అధ్యయన కమిటి ఛైర్మన్‌గా బిసి కులాలను గుర్తించి నివేదకను ఇవ్వడం జరిగిందని, తన సుదీర్ఝ పాదయాత్ర సందర్భంగా వారి కష్టనష్టాలు తెలుసుకుని వారికి సముచిత స్ధానం, గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖామంత్రి ధర్మానకృష్ణదాస్ మాట్లాడుతూ బిసి గుండె%్‌ఘోష విని, వారిని సమున్నతస్ధాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్న నేత ఈదేశంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి మాత్రమే అన్నారు. గతంలో ప్రభుత్వాలు బిసిలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుని అనంతరం విస్మరించేవారన్నారు.
3,648 కిలోమీటర్ల సుదీర్ఝ తన పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకున్న జగన్మోహనరెడ్డి బిసి అధ్యయన కమిటీతో వెనుకబడిన కులాలును గుర్తించారన్నారు. బిసిల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి తన క్యాబినెట్‌లో ఏడుగురు బిసిలకు మంత్రులుగా నియమించడమేకాకుండా వారికి ఐదు డిప్యూటి సియం పదవులు ఇచ్చారన్నారు. 139 బిసి కులాలకు 56 కార్పోరేషన్‌లు ఇచ్చిన ఘనత సియం జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ఇలాంటి మహానాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉపముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ రాష్ట్రంలో నెలరోజులు ముందుగా సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు. ఎ న్నికల మానిఫెస్టోలో చెప్పిన వాగ్ధానాల్లో ఇప్పటికే 90 శాతం నెరవేర్చిన ఘనత సియం జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 56 బిసి కార్పోరేషన్‌లు ఏర్పాటుచేసి ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమింపబడిన వారందరూ బాధ్యతతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వెనుకబడినవర్గాలకు చేరవేయడంలో కీలకపాత్ర వహించాలని సూచించారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎ న్నికలకు ముందు ఏలూరులో బిసి గర్జన జరిగిందని, నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వై.యస్. జగన్మోహనరెడ్డి ఆరోజు సభలో చెప్పిన ప్రతీమాట ఈరోజు అమలు చేస్తున్నారన్నారు. బిసిలు అంటే వెనుకబడినవారు కాదని బ్యాక్ బోన్ కులమని చాటి చెప్పారు. నాడు మహానేత వైయస్. రాజశేఖరరెడ్డి ప్రజలకోసం ఎ న్నో మంచి కార్యక్రమాలు చేసారని ఈవేళ వారి కుమారుడైన వైయస్. జగన్ అదేబాటలో నడుస్తున్నారన్నారు.
ఈవేళ మనకు పదవి వచ్చిందని అది మీపై విశ్వాసం ఉంచి అప్పగించిన ఒక బాధ్యతగా గుర్తెరెగాలేతప్ప అది అధికారికంగానూ, అలంకారంగానూ భావించవద్దని హితవు పలికారు. మీకులాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసులువచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ బిసి కులాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఎ దుగుదలకు గతంలో ఎ వరూ కృషి చేయలేదని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఆదిశలో దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వం కీలకమైన శాఖలను బిసిలకు కేటాయించడం ద్వారా సముచిత స్ధానం కల్పించారన్నారు.
రాష్ట్ర కార్మికశాఖామంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నెలరోజుల ముందేవచ్చిందని, సంక్రాంతి పండుగలాగే బిసి సంక్రాంతిని జరుపుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తమ పాదయాత్రలో బిసిల కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్నారన్నారు. బిసి కులాలకు 56 కార్పోరేషన్‌లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. బిసిలకు బ్రహ్మరాత వ్రాసారో లేదోగానీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ 56 ఛైర్మన్ పదవులతోపాటు 672 మందిని డైరెక్టర్లుగా నియమించారన్నారు.
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాజకీయచరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి బిసిలకు 56 కార్పోరేషన్‌లు ఏర్పాటు చేశారన్నారు. వార్డుమెంబరుగా కూడా పోటీచేయలేని కులాలను గుర్తించి వారికి కార్పోరేషన్‌ల ఏర్పాటుద్వారా సముచిత న్యాయం చేశారన్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎ క్కడా చేయనివిధంగా బిసిల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలాగా ఈప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వండేవాడిగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఉండగా వడ్డించేవాళ్లుగా మన కులాల వాళ్లనే గుర్తించి ఛైర్మన్‌లు ఇవ్వడం ద్వారా వారికి వెనుకబడిన వర్గాల, కులాల పట్ల ఉన్న అభిమానం చిత్తశుద్ధి ద్వారా నమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు.
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ దేశం అంతా వైయస్. జగన్మోహనరెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు వెనుకబడిన జాతులకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా అభివర్ణించారు. మాటనిలుపుకునే మనిషి, మడమ తిప్పని సియం వైయస్. జగన్ లాంటి ముఖ్యమంత్రులను తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు కోరుకుంటున్నాయన్నారు. కరోనా సమయంలో సంక్షేమ పధకాలతో పేదలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. 139 బిసి కులాలకు అండగా నిలిచిన వ్యక్తిగా సియం జగన్‌ను ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన జాతుల వ్యక్తిగా ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. సంక్రాంతి, క్రిష్టమస్ కన్నా వెనుకబడిన జాతులకు ఈరోజు పండుగ వచ్చిందని అన్నారు.
శాసనసభ్యురాలు విడదల రజని మాట్లాడుతూ 139 కులాలకు కార్పోరేషన్‌లు ప్రకటించిన గొప్పతనం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిదేనని, ఆపదవుల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సంక్షేమ పధకాల్లో వెనుకబడిన తరగతుల వారే అధికంగా లబ్దిపొందుతున్నారన్నారు. అట్టడుగు వర్గాలవారిని గుర్తించి వారికి సముచితమైన స్ధానం కల్పించడం అభినందనీయంఅన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, అవంతి శ్రీనివాస్, సిదిరి అప్పలరాజు, యంపిలు వల్లభ##నేని బాలశౌరి, నందిగం సురేష్, మార్గాని భరత్‌రామ్, గోరంట్ల మాధవ్, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, శాసనసభ్యులు జోగి రమేష్, కొలుసు పార్ధసారథి, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్, అల్లాడి రాజకుమారి, వాసుబాబు, కెసిసిబి ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, బిసి సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి కె. ప్రవీణ్‌కుమార్ , మేనేజింగ్ డైరెక్టరు బి.రామారావు, కృష్ణాజిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, నగర సిపి బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్లు కె. మాధవిలత, కె. మోహన్‌కుమార్ , సబ్ కలెక్టరు హెచ్‌యం. థ్యానచంద్ర, వైయస్ఆర్ సిపి నాయకులు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ , లక్ష్మారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.