పారిశ్రామిక ప్రగతికి విశాఖ చిరునామా..
Ens Balu
2
Vijayawada
2020-12-17 21:26:42
విశాఖను పారిశ్రామిక ప్రగతికి చిరునామాగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, క్రిడా , యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం నాడు విజయవాడ లోని ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని పర్యాటక, సాంస్కృతిక, క్రిడా , యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలసి పలు అంశాలపై “భూమి వరల్డ్ సంస్థ” విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం, పద్మనాభం మండలాలలో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి తెలిపారు. ప్లగ్ అండ్ ప్లే పద్థతిలో ఎం.ఎస్.ఎం.ఇ. సంస్థలకు ఉపయోగ పడేలా ఏర్పాటు చేయబోయే ఈ పార్కుల ద్వారా రూ.2500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా తేనున్నారని ఆయన తెలిపారు. ఈ సంస్థ ఇప్పటికే మహారాష్ట్రలో 50 లక్షల చదరపు అడుగులు సామర్థ్యం గల 2 పార్కులను నిర్వహిస్తుందని, వాటిలో 1400 ఎం.ఎస్.ఎం.ఇ. యూనిట్లు పని చేస్తున్నాయని, 26 వేల మందికి ప్రత్యక్ష ఉపాథి లభించిందని రూ.3500 కోట్లు టర్నోవర్ సాధించారని తెలిపారు. విశాఖ వేగంగా అభివృద్థి చెందుతున్నదని, రాబోయే రోజుల్లో మరింత ప్రణాళికా బద్దంగా పారిశ్రామకాభివృద్థి జరగనున్నదని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, భూమి వరల్డ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.