మరో 30ఏళ్లు వైఎస్ జగనే సీఎంగా ఉంటారు..
Ens Balu
3
Vijayawada
2020-12-17 22:09:31
బీసీ గుండెఘోష విని, వారికి సమున్నత స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్న నేత ఈ దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమేనని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం బీసీ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సభలో 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం.. వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వెనుక బడిన జాతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వంటి నాయకులను గతంలో చూశామని అన్నారు. బీసీ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్ తన క్యాబినెట్‌లో బీసీకు ఏడుగురురికి.. మంత్రులుగా వెనుక బడిన వారికి అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారన్నారు. 139 బీసీ కులాకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదని పేర్కొన్నారు. ఇద్దరు బీసీ నాయకులను రాజ్యసభకు పంపారు. ఇలాంటి మహానాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేస్తున్న కుతంత్రాలను రాష్ట్ర ప్రజలు సింహాల్లా తిప్పి కొట్టాన్నారు. జగన్ విద్యా, వైద్యంలో బడుగులకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. మరో 30 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగుతారని పేర్కొన్నారు. బీసీ గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని, బీసీ అధ్యాయన కమిటీతో వెనుక బడిన కులాలు గుర్తించారన్నారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్దే దేశ అభివృద్ధి అని అంబేద్కర్ తెలిపారని, ఆయన ఆశయాలతో సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ‘3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా పేద కష్టాలు తొసుకున్నారని అన్నారు. బడుగు బహీన వర్గాకు సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలోనే సక్రమంగా అందుతున్నాయని అన్నారు. గత పాలకలు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు. బీసీ వర్గాలకు మేలు చేసిన మహానాయకుడు సీఎం జగన్ మాత్రమేనని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధానప్రసంగం చేసిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎరు, కృష్ణ దాస్,అంజాద్ బాష, మంత్రు, బొత్ససత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్,వేణుగోపా కృష్ణ, శంకర్ నారాయణ, జయరాం, సీదిరి అప్పల్ రాజు,అవంతి శ్రీనివాస్,కొడాలి నాని,పేర్ని నాని,కన్నబాబు, అదిమూపు సురేష్, ఎంపీు,బా శౌరి, మోపిదేవి వెంకట రమణ, సుభాష్ చంద్రబోస్,భరత్, నదిగాం సురేష్, తదితయి పాల్గొన్నారు.