పర్యాటక రంగంలో నూతన పాలసీ ఆవిష్కరణ..


Ens Balu
2
Visakhapatnam
2020-12-19 18:33:13

పర్యాటకరంగంలో  భారీ పెట్టుబడులను  ఆహ్వనించేలా , అందుకు తగిన సంస్థలను  ప్రోత్సాహించేలా  నూతన పర్యాటక  పాలసీని రూపొందించినట్లు   రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు  తెలిపారు. శనివారం నాడు  స్థానిక  సర్య్కూట్ హౌస్ లో  ఆయన “ఆంధ్రప్రదేశ్  పర్యాటక పాలసీ 2020 – 2025 “ ని  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆయన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహజవనరులు ఉన్నరాష్ట్రమని,  టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం,రివర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం,రిక్రియేషన్  టూరిజం లను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.  అంతర్జాతీయ  పర్యాటకులను  ఆకర్షించేలా  వసతి, సదుపాయాల కల్పనకు  ప్రాధాన్యం  ఇవ్వనున్నట్లు  తెలిపారు.  5 స్టార్, 7 స్టార్ హోటల్ లు తీసుకురావడానికి  ప్రయత్నిస్తున్నామని, ఈ హోటల్ లు నెలకొల్పడానికి  అవసరమైన  భూమి,  ఇతర సదుపాయాలను  ప్రోత్సాహకాలను  ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.  మెగా  టూరిజం ప్రాజెక్టులకు లీజు కాలాన్ని  66 ఏళ్ల నుంచి  99 ఏళ్లకు పెంచామని  తెలిపారు. లీజు తీసుకోవడానికి  ఆస్తి విలువపై 2 శాతం ఉన్న స్టాంప్ డ్యూటీని  1 శాతానికి  తగ్గించామని   తెలిపారు.   స్పెషల్ పర్పస్  వెహికల్ (ఎస్ పి వి)  ద్వారా  పెట్టుబడులకు  పారదర్శకంగా,  అవినీతికి  తావు లేకుండా  అనుమతులిస్తామని  తెలిపారు. అనుమతులు కనిష్టంగా  30 రోజులు, గరిష్టంగా  90రోజులలో  ఇస్తామని  తెలిపారు. పెట్టుబడులను   ఆకర్షించేలా  నిబంధనలను సరళీకరిస్తున్నామని  తెలిపారు.  ఇతరరాష్ట్రాల పెట్టుబడిదారులకు  అవగాహన కల్పించేందుకు  చెన్నై, ముంబాయి లాంటి నగరాలలో రోడ్ షోలు నిర్వహిస్తామని తెలిపారు.   అధికారులు , నిపుణులతో  చర్చించి  పాలసీని  మెరుగు పరచామని తెలిపారు.    కోవిడ్ పరిస్థితుల  అనంతరం  పర్యాటకరంగాన్ని  పునరుద్దరించేందుకు    రూ. 200 కోట్లతో ‘”రీస్టార్ట్ ప్యాకేజీ” ని  ఇస్తున్నామని  తెలిపారు.   చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు తీసుకునే బ్యాంకు రుణాలపై  4.5 శాతం  వడ్డీని  ప్రభుత్వం  భరిస్తుందని  తెలిపారు.  టూర్  ఆపరేటర్లు, హోటళ్లు,రెస్టారెంట్లు నిర్వాహకులు ఈ ప్యాకేజీ ద్వారా  లబ్దిపొందుతారని  తెలిపారు. రాష్ట్రంలో రాయలసీమ , కోస్తాంధ్ర,  ఉత్తరాంధ్ర,  , గోదావరి సర్య్కూట్ లను ప్రత్యేకంగా  అభివృద్ది పరుస్తామని   తెలిపారు. ఇతర రాష్ట్రాల పర్యాటకులను  ఆకర్షిస్తామని  తెలిపారు.  రాబోయే  2 నెలలలో ఈ నాలుగు ప్రాంతాలలో  ఇన్ వెస్టర్స్ మీట్ లను   ఏర్పాటు  చేయనున్నట్లు  తెలిపారు. పర్యాటకరంగంలో  లక్షమందికి  జీననోపాధి లభిస్తుందని   తెలిపారు.   బోట్ లను  పర్యవేక్షించేందుకు  9 కమాండ్ కంట్రోలు రూములు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇరిగేషన్, టూరిజం, పోలీసు,రెవెన్యూ, ఇతర  శాఖల  అధికారులు వీటిలో  ఉంటారని  తెలిపారు.   ప్రస్తుతం  అసంఘటితంగా  ఉన్న టూర్ ఆపరేటర్లు, గైడ్ లకు  వృత్తి పరమైన  శిక్షణ ఇచ్చి  ప్రొఫెషనలిజం ఉండేలా  తీర్చి దిద్దుతామని  తెలిపారు.    “అతిధి దేవోభవ”  సాంప్రదాయాన్ని  పాటిస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  పార్లమెంట్ సభ్యులు  ఎం వి వి సత్యనారాయణ,  శాసన సభ్యులు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, పర్యాటక శాఖ ఆర్ డి రాంప్రసాద్,   టి ఐ ఓ పూర్ణిమాదేవి  పాల్గొన్నారు.