వైభవంగా భగవద్గీత అఖండ పారాయణం..
Ens Balu
3
Tirumala
2020-12-25 19:45:14
వైకుంఠ ఏకాదశితోపాటు విశేషమైన గీతాజయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై భగవద్గీత అఖండ పారాయణం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి దాదాపు 4 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో గల 700 శ్లోకాలను వేదపండితులు పారాయణం చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతకుముందు టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. కృష్ణార్జున వ్యాఖ్యానం చేశారు. కృష్ణం వందే జగద్గురుమ్ భజనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, రిసెప్షన్ డెప్యూటీ ఈవో బాలాజి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.