ఏపీ సమాచార శాఖలో భారీగా సిబ్బంది కొరత..


Ens Balu
3
Vijayawada
2020-12-29 12:48:34

ఆంధ్రప్రదేశ్ లో సమాచార శాఖ సిబ్బంది లేమితో కొట్టిమిట్టాడుతోంది..ఏపీఆర్వోలు, డిపీఆర్వోలు,డిప్యూటీ డైరెక్టర్లు, ఏడీస్థాయి అధికారుల ఖాళీలు భారీగా ఏర్పడటంతో ప్రభుత్వ కార్యక్రమాలను మీడియాకి ప్రెస్ నోటు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో సమాచారశాఖలో సినిమా ఆపరేటర్లను ఫోటో గ్రాఫర్లుగానూ, ఏపీఆర్వోలగాను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల ఏపీఆర్వో చేసే ఉద్యోగాన్ని ఏడీలు, డిడిలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఏపీఆర్వోలను ప్రభుత్వం నియమించినా వారికి ప్రెస్ నోట్లు రాయడం రాకపోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. దీనితో  సిబ్బంది కొరత ఉన్న విభాగాల్లో వారిని వినియోగించుకుంటున్నారు సమాచారశాఖ అధికారులు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు మంత్రులు ఉండటంతో వారి ప్రెస్ కవరేజీ సమాచారశాఖకు తలనొప్పిగా తయారైంది. కొన్ని జిల్లాల్లో కార్యక్రమం జరిగిన వెంటనే వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారాన్నిపంపుతున్నా...మరికొన్ని జిల్లాల్లో సమాచారశాఖ కనీసం ప్రెస్ కోసం వాట్సప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయలేదు. కాదు కాదు చేస్తే మరింత ఒత్తిడి పెరుతుందని మానేశారు. ఇంకా పాత జీమెయిల్ విధానంలోనే ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు అరకొరగా పంపుతున్నారు. మంత్రులు వద్ద పీఆర్వోలు ఉన్నప్పటికీ వారు ఆయా జిల్లాలకే కొద్దిమంది మీడియాకే పరిమితం అవుతున్నారు. మంత్రుల కార్యక్రమాలు నేరుగారు సమాచారశాఖ కు కాకుండా వారే మీడియాలకు పంపుతున్నారు. దీనితో మంత్రుల కార్యక్రమాలకు సమాచారశాఖ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే సమయంలో మిగిలిన ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కార్యాలయాల్లోని టైపిస్తులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫోటో గ్రాఫర్లు ఇలా చాలా పోస్టులే సమాచారశాఖలో ఖాళీగా ఉండిపోయాయి. రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న తరుణంలో ముఖ్యమైన మూడు జిల్లాల్లోని సమాచారశాఖ శాఖలో ఏపీఆర్వోలు, కార్యాలయ సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుందని అంతా భావించినా సిబ్బంది నియామకంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా చాలా చోట్ల ప్రభుత్వ పథకాల సమాచారం కూడా పత్రికలు, ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలకు రాకుండా పోతుంది. ప్రతీ జిల్లా నుంచి అరకొరగానే ప్రెస్ నోట్లు వస్తున్నాయి. మంత్రులు కార్యక్రమాలు తప్పా సమాచారశాఖకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్యక్రమాలు కవర్ చేసే అవకాశం లేకుండా పోతుంది. డిడి, ఏడీ, డిపీఆర్వో, డివిజనల్ పీఆర్వోల మీద భారం మొత్తం పడిపోతుంది. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా సమాచారశాఖలోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పాతబడినవి కావడం కూడా వేగంగా మీడియాకి సమాచారం అందించే విషయంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకి ముగ్గురు ఏపీఆర్వోలను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి కష్టంగా మరుతోంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే సమాచారశాఖలో ఖాళీలను భర్తీ చేస్తే పరిస్థితి కొలిక్కి వచ్చేటట్టు కనిపించడంలేదు..ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి..