జనవరి నెలలో శ్రీవారికి జరిపే విశేష కార్యక్రమాలు..


Ens Balu
2
Tirumala
2020-12-29 15:56:25

తిరుమలలో శ్రీవారికి జనవరి నెలలో నిర్వహించే విశేష కార్యక్రమాలు, ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అవన్నీ ఈ క్రింది విధంగా ఆయా తేదీల్లో జరగనున్నాయి.. - జ‌న‌వ‌రి 7న అధ్య‌య‌నోత్స‌వాలు స‌మాప్తి. - జ‌న‌వ‌రి 8న తిరుమల‌నంబి స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వేంచేపు. - జ‌న‌వ‌రి 9, 24వ తేదీల్లో స‌ర్వ ఏకాద‌శి. - జ‌న‌వ‌రి 10న శ్రీ తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం. - జ‌న‌వ‌రి 13న భోగి పండుగ‌. - జ‌న‌వ‌రి 14న మ‌క‌ర సంక్రాంతి. - జ‌న‌వ‌రి 15న క‌నుమ పండుగ‌, శ్రీ గోదా ప‌రిణ‌యోత్స‌వం, తిరుమ‌ల శ్రీ‌వారి శ్రీ పార్వేట ఉత్స‌వం. - జ‌న‌వ‌రి 28న శ్రీ రామ‌కృష్ణతీర్థ ముక్కోటి. - జ‌న‌వ‌రి 30న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం.