తండ్రీ కొడుకులకి బోర్ కొడితే రైతులు గుర్తొచ్చేస్తారు..


Ens Balu
3
Visakhapatnam
2020-12-29 18:22:21

హైదరాబాద్ లో బోర్ కొట్టి నపుడు తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ వెంటనే అమరావతిలో రైతులు గుర్తొచ్చి రెచ్చగొట్టే విధంగా ఏదో టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ లోని మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ళ, పట్టాల పంపిణీ  మహాయజ్ఞంలా చేస్తుంటే  ప్రతిపక్షం లో ఉన్న చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం సంస్కారం ఉన్నా తన తీరు మార్చుకోవాలన్నారు.  శత కోటి నానీల్లో ఈయన ఇంకో నాని అని ఒక బాధ్యతకలిగిన మంత్రి గురించి అలా మాట్లాడటం చాలా తప్పని అన్నారు. నాని తండ్రి పేరున్న నాయకుడు సినిమా ప్రమోషన్లలో భాగంగా రావడం,రోడ్ షోలు చేయటం, నాలుగు డైలాగులు చెప్పడం సరికాదన్నారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోనో మరొకరితోనే చెప్పించుకోవలసిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేదన్నారు.  ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కలెక్టర్ లతో మోనటరింగ్ చేసి రైతులు విషయం లో అడగకుండానే ఎం కావాలో ముందే అందిస్తున్నారన్నారు. విశాఖలో ఇళ్ళ 2,96,272మంది లబ్ధిదారులకి అందించామన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.పేదలందరికీ ఇళ్ళుస్థలాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో నిజమైన పండుగ వాతావరణం సంక్రాంతి పండుగకు ముందే నెలకొందని అన్నారు.  పట్టాల పంపిణీలో వివక్షత లేకుండా పాలన జరుగుతోందన్నారు. భీమిలిలో టిడిపి గ్రామాలు అధికంగా ఉన్నా అర్హత ఉన్న అందరికీ ఇళ్లు ఇవ్వడడానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పంట నష్టం జరిగినా గత ప్రభుత్వ హయాంలో  కాలయాపన చేసారే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని..గతం తెలుసుకొని  ఎవరైనా మాట్లాడాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి  నాయకత్వంలో నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు చెప్పిన దానికంటే ముందే పరిహారం అందిస్తున్నామన్నారు. సచివాలయాల వద్ద పంటకి ఇన్సూరెన్స్, అధిక దిగుబడులు వచ్చేలా విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు,రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడం అన్ని రకాలుగా సహయ సహకారాలు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా నిలుస్తున్న విషయం దేశమే కీర్తిస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.