స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్–2020 పోస్టర్ ఆవిష్కరణ..


Ens Balu
2
Tirupati
2020-12-29 20:35:00

తిరుపతి నగరంలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను 2021 జనవరి 04 నుంచి 07 వరకు  నిర్వహిస్తున్నట్లు అనంతపురము రేంజ్ డి.ఐ.జి  క్రాంతి రాణా టాటా చెప్పారు. మంగళవారం తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి.  ఏ.రమేష్ రెడ్డితో కలిసి పోలీస్ మీట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మొదటి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రధమంగా  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇతర జిల్లాల సీనియర్ ఐ.పి.యస్ అధికారులతో పాటు కొత్తగా రాష్ట్రానికి వచ్చిన యువ ఐ.పి.యస్ అధికారుల సహకారంతో కార్యక్రమం మొత్తం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ డ్యూటీ మీట్లో జిల్లాల నుంచి వివిధ విభాగాలలో రేంజ్ డ్యూటీ మీట్ లో ప్రతిభ ఆధారంగా ఎన్నికైన పోలీస్ సిబ్బందిని జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపిస్తామన్నారు. అన్ని జిల్లాలలో పోలీస్ అధికారులు సాధించిన విజయాలపై స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, కళాశాల విద్యార్థులకు కూడా విజ్ఞాన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఈ ప్రప్రధమ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం ఆనందకరమని, ఇది పూర్తిగా పోలీస్ విశిష్టతను తెలియజేస్తుందని, సమాజంలో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి పోలీస్ విభాగం సర్వసన్నద్ధంగా ఉన్నదని తెలపడానికి ఇది ఒక ప్రధాన సూచికగా బావించవచ్చునన్నారు. రాష్ట్ర డి.జి.పి  గౌతం సవాంగ్ సూచనల మేరకు రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, దీనికి వేదికగా స్థానిక ఏ.ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ,  PTC కల్యాణి డ్యాం వద్ద నిర్వహిస్తున్నామని చెప్పారు.  ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ యస్.పి స్థాయి అధికారి వరకు పాల్గొంటున్నారని, ఇందులో కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి, పోట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐ.ఓ ఫోటోగ్రఫీ మొదలగు వాటిపై పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం డ్యూటీ మీట్ కోర్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.