ప్రభుత్వ యంత్రాంగమంతా సోషల్ మీడియాలోనే..
Ens Balu
3
Tadepalle
2020-12-30 14:25:09
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ యంత్రాంగమంతా సోషల్ మీడియా బాట పట్టింది...ఇదేదో ప్రచారానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే..ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నేరుగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో అన్నిశాఖల అధికారులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్సస్టాగ్రామ్, టెలీగ్రామ్, వాట్సప్ గ్రూపుల్లోకి చేరారు. అన్ని రకాల ప్రభుత్వశాఖలు అన్ని సోషల్ మీడియాల్లోనూ ప్రత్యేక పేజీలు, గ్రూపులు ఏర్పాటు చేసి, రోజు వారీ కార్యక్రమాలన్నీ అప్ లోడ్ చేస్తున్నారు. తద్వారా చాలా మంది శాఖల అధికారులకు, ప్రజలకు ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాలేంటో నేరుగా తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా కార్యక్రమం కోసం సాధారణ ప్రజలు తెలుసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కాని ఇపుడు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల ద్వారా ఏం చేస్తున్నారో అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వుంది. విశేషం ఏంటంటే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అఖిల భారత స్థాయి అధికారులు సైతం ఫేస్ బుక్ పేజీల ద్వారా తమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నారంటే...పరిస్థితి ఏవిధంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఏ ప్రభుత్వ శాఖ ద్వారానో చెప్పాలంటే జరిగే పనికాదు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఒక్క పోస్టు పెడితే అధికారులు ఏం చేస్తున్నారో ప్రజలకు క్షణాల్లో తెలిసిపోతుంది. కొన్ని ప్రభుత్వ శాఖలైతే వారు చేసే కార్యక్రమాలు మీడియాకోసం ప్రత్యేకంగా ప్రెస్ నోట్లు కూడా న్యూస్ ఫార్మాట్ లో పెడుతున్నారు. తద్వరా ఇకేసారి ప్రజలకు, మీడియాకి ప్రభుత్వ అధికారులు సమాచారం తెలియజేసినట్టు అవుతుంది. అందులోనూ కరోనా సమయంలో అధికారులను కలవడానికి మీడియాకి వీలుపడని సమయంలో సోషల్ మీడియా ద్వరా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వశాఖల అధికారులు ఏంచేస్తున్నారో తెలుసుకోవడానికి సోషల్ మీడియానే ప్రజలంతా ఆశ్రయించడం, అదే సమయంలో ముఖ్యమైన యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం అధికమైంది. ఇదే క్రమంలో కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఫోటోలు మాత్రమే పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. సదరు కార్యక్రమం ఎందుకు చేశారు..ఎవరు పాల్గొన్నారు..అధికారులు పేర్లు కూడా పెట్టకపోవడంతో కాస్త గందరగోళం కూడా ఏర్పడుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అంటే పత్రికలు, టివిల్లో వస్తేనే ప్రజలకు తెలిసేది..ఇపుడు ఆ రెండింటికంటే ముందు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చేసే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, అనినీతి, సేవాకార్యక్రమాలు ఏదైనా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాయి..ఇది శుభపరిణామంగానే చెప్పాలి.