రాష్ట్రంలో పెరగనున్న10వేల సచివాలయాలు..


Ens Balu
3
Velagapudi
2020-12-31 09:51:07

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు పెరగనున్నాయా..అంటే అవుననే అంటోంది అధికార యంత్రాంగం. రాష్ట్రం ప్రభుత్వం 30లక్షల మంది లబ్ది దారులకు కొత్తగా మంజూరు చేసిన ఇళ్ల ప్రదేశాలన్నీ ప్రత్యేక గ్రామాలుగా మారబోతున్నాయి. ప్రస్తుతం వున్నచాలా కుటుంబాలు ఒకే ఇంటిలో వుంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఇళ్లు, పట్టాల ద్వారా రాష్ట్రంలో కొత్తగా గ్రామాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఆ విధంగా చూసుకుంటే గ్రామాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు నుంచి 4వేల జనాభా వున్న గ్రామానికి, లేదా వార్డుకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రభుత్వం ఇపుడు కొత్తగా 30లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేయడంతో కొత్తంగా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఏర్పాటవుతున్నట్టు అధికారంగా లెక్కలే చెబుతున్నాయి. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతీ మూడు వేల కుటుంబాలకు ఒక సచివాలయం ఏర్పాటు చేసినా మరో 10వేల సచివాలయాలు ఏర్పాటు కావాలి..అదే జరిగితే ప్రస్తుతం వున్న గ్రామ, వార్డు సచివాలయాలు రెండింతలు పెరిగే అవకాశం వుంది. ఆరకంగా చూసుకున్నా..ఈ ప్రభుత్వంలో లబ్దిదారులందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తయితే వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా సచివాలయాలు ఏర్పాటు కావాల్సివుంటుంది. ఒకేసారి పదివేల సచివాయాలు ఏర్పాటు చేయకపోయినా పెరిగిన కుటుంబాలకు అందులో సగం ఐదువేలు సచివాలయాలైనా ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ఇళ్లు, కుటుంబాలన్నీ రెండింతలు అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎలా చూసుకుకున్నా మరో లక్ష ఉద్యోగాలు పెరిగే సచివాలయాలకు నియమించాల్సి వుంటుంది. ఇదంతా జరగాలంటే మరో ఐదేళ్లు సమయం పడుతుంది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్లాలి, ఉద్యోగం సంపాదించాలి అనుకునేవారికి ఖచ్చితంగా మరోసారి సచివాలయ ఉద్యోగాలు వస్తాయనే సంకేతం కొత్తగా ఏర్పాటు కాబోతున్న గ్రామాలే తెలియజేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..!