అల్లూరిపై అభిమానం అలా తీర్చుకున్నారు..
Ens Balu
3
Rowthulapudi
2020-12-31 10:30:58
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీరుడు..అల్లూరి సీతారారామరాజుపై ప్రముఖ నటులు, సినీ దర్శకులు ఆర్.నారాయణమూర్తి అభిమానం ఏ విధంగాతీర్చుకున్నారో తెలిస్తే ఖచ్చితంగా చేయొత్తి నమస్కరిస్తారు. తెలుగోడు సినిమాని ఆర్.నారాయణమూర్తి విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేటలోని అల్లూరి పార్ధీవ శరీరం దహనం చేసిన చోట తీశారు. ఆ సమయంలోనే ఆయనకు క్రిష్ణదేవిపేటతో బంధం ఏర్పడింది. ఈ గ్రామాన్ని మరిచిపోకుండా ఉండాలంటే ఏంచేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆయన తమ్ముడిని అదే గ్రామానికి అల్లుడిని చేస్తే బావుంటుందని భావించి, క్రిష్ణదేవిపేట గ్రామానికి ఒబ్బలరెడ్డివారికి కుటుంబానికి అల్లుడిని చేశారాయన. అల్లూరి సీతారామరాజు గుర్తొచ్చినప్పుడల్లా ఆర్.నారాయణమూర్తి తన తమ్ముడితో కలిసి క్రిష్ణదేవిపేట గ్రామాన్ని సందర్శిస్తారు. పీడిత ప్రజల కోసం తెల్లవాడిపై పోరాటం చేసిన పోరాటల పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని అనుకున్న సమయంలో క్రిష్ణదేవిపేట నుంచి సంబంధం రావడంతో ఆలోచించకుండా తన తమ్ముడికి ఆ గ్రామానికి అల్లుడిని చేశానని తడుముకోకుండా చెబుతారు. అలాంటి మహానుభావుడికి నేటి వరకూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన గుర్తొచ్చినపుడల్లా తలచుకొని బాధపడుతుంటానని అంటారు. స్వాతంత్ర్య సమరయోధులు అత్యధికంగా వున్న భారతదేశంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వారికి ఉన్నతమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైనా వుందని చెబుతారు ఆర్.నారాయణమూర్తి. వారి ప్రాణాల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్నామని అలాంటి మహానుభావుల అను క్షణం స్మరించుకోవాలని కూడా అంటారాయణ. పేరు ప్రఖ్యాతల కోసం ఆలోచిస్తున్న ఆరోజుల్లో అల్లూరిపై అభిమానం, గౌరవం ఆ గ్రామంలోకి కుటుంబానికి అల్లుడిని చేసిందంటే ఆర్.నారాయణమూర్తికి అల్లూరి సీతారామరాజు అంటే ఎంత భక్తో ఇంతకంటే వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అల్లూరికోసం ఆయన చేసే ప్రచారం, అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసే తీరు ఆయనకు దేశంపై వున్న అమితమైన దేశభక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు..హేట్సాఫ్ ఆర్.నారాయణమూర్తి అండ్ హేపీ బర్త్ డే టూ యూ..!