యుకె నుంచి వచ్చే వారిని క్వారంటైన్లో పెట్టాలి..


Ens Balu
3
Tadepalle
2020-12-31 15:35:01

యునైటెడ్ కింగ్ డం దేశం నుండి వచ్చిన వారిని వెంటనే గుర్తించి క్వారంటైన్ లో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కె.భాస్కర్ పేర్కొన్నారు.  గురువారం స్థానిక జిల్లా సచివాలయంలో అమరావతి నుండి మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ అన్ని ఆరోగ్య కార్యక్రమాల పై వివిధ జిల్లాలలోని జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, డి.సి.హెచ్.ఎస్.లు, పి.హెచ్.సి వైద్యాధికారులు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో యునైటెడ్ కింగ్ డం నుండి వచ్చిన వారి యొక్క కాంటాక్ట్ లను గుర్తించి కరోనా పరీక్షలను నిర్వహించాలన్నారు. యు.కె నుండి వచ్చిన వారి యొక్క కాంటాక్ట్ లను అత్యంత ప్రాధాన్యతతో గుర్తించి వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాలను త్వరితగతిన అందించేలా జాయింట్ కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు.  యు.కె నుండి వచ్చిన వారి యొక్క ఏ ఒక్క కాంటాక్ట్ ను వదల కుండా గుర్తించాలని వైధ్యాదికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ తగ్గు ముఖం పట్టిందని విశ్రాంతి తీసుకునే సమయం కాదని ఇది నిరంతర ప్రయాణం లాంటిదని కావున ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  కాల్ సెంటర్ల నుండి కరోనా పరీక్షల కొరకు సంప్రదిoచ్చిన వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డి.ఏం అండ్ హెచ్ ఓ లను ఆదేశించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే అన్ని రకాల ఫీవర్ కేసులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ల యందలి ఫీవర్ క్లినిక్ ల మీద ఐ.వి.ఆర్.ఎస్ ఫీడ్ బ్యాక్ రాష్ట్ర స్థాయిలో తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క ఫీవర్ కేసును ఎంతో ప్రమాణాలతో గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. కోవిడ్ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయిన వారిని గుర్తించి 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షించాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిలో ఆరోగ్యం నిలకడగా లేని వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలించాలన్నారు. సెంటినల్ సర్వేలైన్స్ లో భాగంగా ప్రతి మండలంలోని స్కూల్ మరియు విధ్యా సంస్థల యందలి ప్రతి యొక్క విధ్యార్ధి, ఉపాద్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. స్కూల్ మరియు కాలేజీల లోని పిల్లలకు, ఉపాద్యాయులకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న చోటకూ డా పరీక్షలు చేపట్టి ఎప్పటికప్పడు డాటా ఆన్ లైన్ చేయాలని అధికారులను ఆదేశించారు.