న్యూస్ ఏజెన్సీ కష్టాలు ఇంతింత కాదయ..


Ens Balu
3
Tadepalle
2021-01-01 12:33:47

పత్రికలు, టెలివిజన్ న్యూస్ ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలు, న్యూస్ వెబ్ సైట్లకు జిల్లా ఏతర, రాష్ట్రేతర, జాతీయ వార్తలను సరఫరా చేసే న్యూస్ ఏజెన్సీలు పనిచేయాలంటే చాలా ఖర్చు, సిబ్బందితో కూడుకున్న వ్యవహారమే. చాలా మందికి వార్తలు అందించండంలో కష్టమేముంటుంది అనుకుంటారు చాలామంది. పైగా ఖర్చుకూడా పెద్దగా ఉండదని అంతే తేలికగా మాట్లాడతారు. వాస్తవానికి న్యూస్ ఏజెన్సీలు ఎలా పనిచేస్తాయో...ఒక వార్తను సేకరించి దానిని న్యూస్ ఫార్మాట్ లో మీడియా సంస్థలకు పంపడానికి ఒక న్యూస్ ఏజెన్సీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మంది సిబ్బంది పనిచేస్తారనే విషయం తెలిస్తే నిజంగా ముక్కున వేలేసుకుంటారు. ఇంత కష్టపడి, డబ్బు ఖర్చుచేసి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుబంధ పత్రాలు పొందడానికి చాలా ఖర్చు, శ్రమ తప్పదంటే అతిశయోక్తి కాదు.. ఇంతా కష్టపడి ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచారచారశాఖ మాత్రం అక్రిడిటేషన్ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు ఇవ్వడంలో అనేక కొర్రీలు వేస్తుంది. ఒక న్యూస్ ఏజెన్సీలో ఒక చీఫ్ ఎడిటర్, ఇద్దరు సబ్ ఎడిటర్లు, ఒక మేనేజర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్ లేదా వీడియో ఎడిటర్, ముగ్గురు జర్నలిస్టులు, ఒక మెసెంజర్ ఉంటే తప్పా రోజుకి 5 నుంచి పది వార్తలు సేకరించడం కష్టమంటే అది మాటల్లో చెప్పలేం.  రిపోర్టర్లు తెచ్చిన వార్తలు ముందుగా సబ్ ఎడిటర్ డెస్క్  దగ్గరకు వస్తాయ్, ఆతర్వాత వాటిని చీఫ్ ఎడిటర్ డెస్క్లో  ద్రువీకరిస్తారు, ఆపై వార్తలకు అనుగుణంగా ఫోటోలు, వీడియోలు జతచేసి మెసెంజర్  డెస్క్ కు చేరవేస్తారు. అక్కడి నుంచి మెసెంజర్ న్యూస్ ఏజెన్సీకి ఖాతాదారులుగా వున్న పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలు, న్యూస్ వెబ్ సైట్లు, యూట్యూబు ఛానళ్లకు కంటెంట్ ను ఎలక్ట్రానిక్ రూపంలో పంపిస్తారు. అలా పంపిన వార్తలను మీడియా సంస్థలు క్రెడిట్ డేట్ లైన్ తో కొన్నివార్తలను అచ్చువేస్తాయి. అందులో ఫోటోలకి గానీ, వార్తలకు గానీ క్రెడిట్ లైన్ లేకపోతే న్యూస్ ఏజెన్సీలు పంపిన వార్తలకు ఫలితం వుండదు. ఇలా అన్నీ అధికారికంగా పనిచేయాంటే నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ కింద ప్రభుత్వం నుంచి అనుబంధ పత్రాలతోపాటు సంస్థ పేరు, లోగో, న్యూస్ ఏజెన్సీ ట్రేడ్ మార్క్, న్యూస్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్,గ్రీన్ మేట్ స్టూడియో, అవసరం అనుకుంటే ప్రత్యేక ఎలక్ట్రానిక్ మెసెంజర్ లైన్,  లేదా గ్రూప్ మీడియాలైన్ లీజుకి తీసుకోవాల్సి వుంటుంది.  ఇక పోతే వీటి నిర్వహణకు 5 కంప్యూటర్లు లేదా హైఎండ్ ల్యాప్ టాప్ లు, ఒక టెలీఫోన్ కూడిన ఫ్యాక్స్ కనెక్షన్, ఒక హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇద్దరు సబ్ ఎడిటర్లు, నాణ్యమైన విద్యుత్(నెలకు కనీసం కరెంటు బిల్లు రూ.800 నుంచి రూ.1600), అధునాతన ప్రింటర్, ఫోటో కెమెరాలు, వీడియో కెమెరాలు, ఒక కార్యాలయం(నెలకు అద్దె కనీసం రూ.8500 నుంచి 10వేలు) కావాల్సి వుంటుంది. వీటితోపాటు ప్రకారం కనీసం ఐదుగురు( ఇద్దరు సబ్ ఎడిటర్లు, ఒక ఫోటో గ్రాఫర్, ఒక మెసెంజర్, ఒక వీడియో గ్రాఫర్ లేదా వీడియో ఎడిటర్ కి జీతాలు(ఒక్కొక్కరికీ రూ.8500 వేల నుంచి రూ.12500),ముగ్గురు జర్నలిస్టులు వారికి లైన్ అకౌంట్ బేసిస్ లో కనీసం రూ.5వేల నుంచి 8వేల వరకూ జీతాలు ఇవ్వాల్సి వుంటుంది. ఇక పోతే న్యూస్ వెబ్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్  నిర్వహణకు  ప్రత్యేకంగా సొంత ఆన్ లైన్ హోస్టింగ్ సర్వర్ దీనికే నెలకు సుమారు రూ.6500 చెల్లించాల్సి వుంటుంది.  వీటితోపాటు ఆదాయపు పన్ను అదేనండీ ఐటీ రిటర్న్స్..(ఏడాదికి ఒకసారి), రూ.40లక్షల టర్నోవర్ దాటితే జిఎస్టీ రిటర్న్స్(ప్రతీ మూడు నెలలకు ఒకసారి అంతే ఈ రెండింటికీ కలిపి ఏడాదికి సుమారుగా రూ.5వేలు), రూ.40 లక్షల లోపు అయితే కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ నిబంధనల మేరకు తీసుకోవాల్సిన పనిలేదు. ఒక ఇతర జిల్లాల్లో అయితే ఒక జర్నలిస్టు, ఒక ఫోటో గ్రాఫర్ పనిచేయాల్సి వుంటుంది.  వారు లైన్ అకౌంట్ బేసిస్ లో లేదా జీతాల రూపంలో పనిచేస్తారు. ఇతర జిల్లాల వార్తలు న్యూస్ ఏజెన్సీ చందాదారులకు అందించాలంటే న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన అధికారిక జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం మాత్రమే న్యూస్ ఏజెన్సీ చందాదారులకు ఇవ్వాల్సి వుంటుంది. ఇన్ని చేస్తే తప్పా న్యూస్ ఏజెన్సీ నిర్వహణ సాధ్యం కాదు. కానీ ఇవేమీ రాష్ట్రప్రభుత్వ సమాచారశాఖకు పట్టవు. ఒక న్యూస్ ఏజెన్సీకి నిబంధనల ప్రకారం అంటే ముఖ్య కార్యాలయం నిర్వహించే చోట కనీసం 5 అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయడం లేదు.  ఇంతా కష్టపడి న్యూస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన సందర్భంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ తొలగించింది ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇలా చాలా మంది జర్నలిస్టులు, న్యూస్ ఏజెన్సీల నిర్వాహకులు ప్రభుత్వ పథకాలు కోల్పోయారు. కాపీరైట్ కోర్టు కేసులు.. న్యూస్ ఏజెన్సీలు ప్రధాన కార్యాలయంతో పాటు, ఇతర జిల్లాల్లోనూ ఒక రిపోర్టర్, ఒక ఫోటో గ్రాఫర్ ను నియమిస్తుంది. అలా కాకుండా ఎవరో రాసిన వార్తలను కాపీ పేస్టు చేసి ఖాతాదారులకు పంపితే, సదరు వార్త యొక్క సొంతదారు కాపీ రైట్ కంటెంట్ కేసులు పెడతాడు. అంతేకాకుండా పెట్టిన సైబర్ క్రైమ్ కేసులు కూడా  న్యూస్ ఏజెన్సీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనితో ఖచ్చితంగా న్యూస్ ఏజెన్సీ యొక్క అధికారిక ప్రతినిధి రాసి పంపిన వార్తలను మాత్రమే ప్రధాన కార్యాలయం నుంచి న్యూస్ ఏజెన్సీ తన ఖాతాదారులకు పంపుతుంది. ఇప్పటికే చాలా చిన్న, మధ్య తరహా పత్రికలు తమకు సదరు జిల్లాల్లోనూ, రాష్ట్రాల్లో ప్రతినిధులు లేకపోయినప్పటికీ నెట్ వచ్చిన వార్తలను కాపీ పేస్టు చేసి వినియోగిస్తూ కాపీ రైట్ కేసులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని పత్రికలు మాత్రం ఆర్ఎన్ఐ నిబంధనల మేరకు జర్నలిస్టులు లేని చోట న్యూస్ ఏజెన్సీలు ద్వారొ పొందిన వార్తలనే క్రెడిట్ లైన్ తో వినియోగిస్తున్నాయి.  వాస్తవానికి పత్రికలుగానీ, టివిఛానళ్లు గానీ, న్యూస్ ఏజెన్సీలు గానీ తమ ప్రతినిధులు లేని చోట వార్తలు తెచ్చుకోవాలంటే వీరు కూడా మరో అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీల నుంచి అధికారికంగా చందా తీసుకొని వార్తలను కొనుగోలు చేసుకొని మాత్రమే వినియోగించాలి. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో పనిచేసిన న్యూస్ ఏజెన్సీలకు కూడా సమాచారశాఖ అధికారులు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో కొర్రీలు వేస్తోంది. అసలు ఒక వర్త సేకరణ జరిగిన తరువాత ఐదు దశలు దాటితే తప్పా సదరు వార్తకు కార్యరూపం రాదు.  రిపోర్టర్ తెచ్చిన వార్తను, ఫోటోను ఎడిటింగ్ చేసేది సబ్ ఎడిటర్ అయితే, దానిని ద్రువీకరించేది చీఫ్ ఎడిటర్, అలా ద్రువీకరించిన తరువాత మెసెంజర్ దానిని మీడియా సంస్థలకు పంపుతాడు. అదే సమయంలో ఫోటోలు కూడా అంతే. ఇంతలా చేసిన వార్తను ఖాతాదారులతో పాటు న్యూస్ ఏజెన్సీ అధికారిక న్యూస్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్ లకి అప్లోడ్ చేస్తారు.  ఇపుడు చెప్పండి న్యూస్ ఏజెన్సీ ఒక వార్త కోసం ఎంత నెట్వర్క్ వినియోగిస్తోందో. ఈ వార్తలో పైన పేర్కొన్న అన్ని ప్రభుత్వ ద్రువీకరణ పత్రాలతో విశాఖ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఏకైక వార్తా సంస్థ ఈరోజు న్యూస్ సర్వీస్. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి అధికారిక న్యూస్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్, సొంత సర్వర్ కలిగిన కార్యాలయం అన్నీ విశాఖలోనే ఉన్నాయి. ఇదేదో ప్రచారం కోసం వాస్తవం ప్రభుత్వం, సమాచారశాఖలోని అధికారులకు తెలియజేయాలనే చిన్న ప్రయత్నం మాత్రమే..ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..!